ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-05-14T06:47:49+05:30 IST

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్‌ పమేలాసత్పథి ఆదేశించారు.

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
నాతాళ్లగూడెంలో ధాన్యాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ పమేలాసత్పథి

 కలెక్టర్‌ పమేలాసత్పథి

వలిగొండ, మే 13: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్‌ పమేలాసత్పథి ఆదేశించారు. శుక్రవారం మండలంలోని మందాపు రం, నాతాళ్లగూడెంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేనందున, కోతకు వచ్చిన ధాన్యంపై జాగ్రత్తలు పాటించాలన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సిబ్బందిని ఆదేశించారు. అంతకుముందు ఎదుల్లగూడెం అంగన్‌వాడీకేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పోషకాహార పంపిణీపై ఆరాతీశారు. అనంతరం మండలకేంద్రంలోని హనుమాన్‌రై్‌స మిల్లును తనిఖీ చేశారు. ఆమెవెం ట డీఆర్‌డీవో ఉపేందర్‌రెడ్డి, సర్పంచ్‌ మల్లేశం, తహసీల్దార్‌ శ్యాంసుందర్‌రెడ్డి, ఎంపీడీవో గీతారెడ్డి ఏపీఎం జానీ, రైతులు పాల్గొన్నారు.  


దరఖాస్తుల ఆహ్వానం 

 జిల్లాలో చదువుతున్న ఎస్సీ విద్యార్థులకోసం 2022-23 విద్యాసంవత్సతానికి బెస్ట్‌ అవైలేబుల్‌ స్కీం కింద ఇంగ్లీష్‌ మీడి యం 1వ తరగతి (డేస్కాలర్‌), 5వ తరగతి (రెసిడెన్షియల్‌) విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు కలెక్టర్‌ పమేలా సత్పథి శుక్రవారం తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి రూ.1.50లక్షలలోపు, పట్టణ ప్రాం తాల్లో నివసించే వారికి రూ.2లక్షలలోపు కలిగి ఉండాలన్నారు. మీసేవా కేంద్రాల ద్వారా జారీచేసిన కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలు సమర్పించాలన్నారు. రేషన్‌కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు జిరాక్స్‌, నాలుగు పాస్‌ఫొటో సైజు ఫొటోలను కార్యాలయ పనిదినాల్లో జిల్లా షెడ్యుల్‌ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తులను వచ్చేనెల 3వ తేదీ సాయంత్రం లోగా అందజేయాలన్నారు. 1వ తరగతికి దరఖాస్తు చేసుకునేందుకు 2016, మే 1 నుంచి 2017, మే 31లోపు జన్మించి ఉండాలన్నారు.  

Read more