ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2022-05-14T06:38:49+05:30 IST
రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం నడిగూడెంలోని కోదండ రామస్వామి ఆలయ నాలుగో వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
నడిగూడెం, మే 13: రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం నడిగూడెంలోని కోదండ రామస్వామి ఆలయ నాలుగో వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సుప్రభాత సేవ, అభిషేకం, అలంకరణ, విశేష హోమం, స్వామి వారికి శాంతికల్యాణాన్ని అర్చకులు వరదాచార్యులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఈ పూజల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం నాగలక్ష్మీమల్లేష్యాదవ్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బడేటి చంద్రయ్య, బెల్లం శ్రీను, కాసాని పుల్లయ్య, ఉపేందర్, పోతురాజు, మహేష్ పాల్గొన్నారు.

