గరంగరంగా మండల సర్వసభ్య సమావేశం
ABN, First Publish Date - 2022-05-14T05:51:59+05:30
తిప్పర్తి మండల సర్యసభ్య సమావేశం గరంగరంగా సా గింది. శుక్రవారం మండల పరిషత కార్యాలయంలో ఎంపీపీ విజయలక్ష్మిలింగారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో విద్యుత, మిషన భగీరథ అధికారులపై సర్పంచులు, ఎంపీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యుత, మిషన భగీరథ అధికారులపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం
తిప్పర్తి, మే 13: తిప్పర్తి మండల సర్యసభ్య సమావేశం గరంగరంగా సా గింది. శుక్రవారం మండల పరిషత కార్యాలయంలో ఎంపీపీ విజయలక్ష్మిలింగారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో విద్యుత, మిషన భగీరథ అధికారులపై సర్పంచులు, ఎంపీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యుతశాఖలో గతేడాది పల్లెప్రగతి ప్రణాళికలో భాగంగా సమస్యాత్మక పనులను గుర్తించి పూర్తి చేయాలని అధికారుల సమక్షంలో తీర్మానం చేసినా ఇప్పటివరకు పూర్తి చేయలేదని అన్నారు. విద్యుతశాఖ మండల అధికారి తన సొంత కాంట్రాక్టర్లను పెట్టుకొని ఎక్కువ పనులు వారికే అప్పగిస్తూ పనులు త్వరతగతిన పూర్తి కాకుండా చేస్తున్నారని సర్పంచులు ఆరోపించారు. అదేవిధంగా డీడీలు కట్టిన రైతుల వద్ద నుంచి కూడా ట్రాన్సఫార్మర్ల కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నార ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జడ్పీ టీఆర్‌ఎస్ ప్లోర్‌లీడర్ పా శం రాంరెడ్డి మాట్లాడుతూ ఎన్నో నెలలుగా విద్యుత సమస్యలతో రైతులు ఇ బ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ వేసవి కాలం పూర్తయ్యే వరకు విద్యు త పనులు పూర్తిచేయాలని సూచించారు. అదే విధంగా సమావేశానికి రాని ఆర్‌అండ్‌బీ, పీఏసీఎస్ అధికారులపై షో కాజ్ నోటీసులను పంపేందుకు తీర్మానించినట్లు తెలిపారు. అనంతరం ఎంపీపీ విజయలక్ష్మీ మాట్లాడుతూ సమావేశానికి రాని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చ రించారు. అధికారులు సర్పంచులు సమన్వయంతో ప్రజా సమస్యలను పరిష్కరించాలని అన్నారు. సమావేశంలో డీఈ నాగయ్య, తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీవో మహేందర్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.