ఆర్య వైశ్య కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2022-11-07T01:59:39+05:30 IST

ఆర్య వైశ్య కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ఆర్య వైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు మాశెట్టి అనంతరాములు డిమాండ్‌ చేశారు. ఆదివారం తిరుమలగిరిలోనిఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు ఇమ్మడి సోమనర్సయ్య అధ్యక్షతన నిర్వహించిన జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆర్య వైశ్య కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి
మాట్లాడుతున్న ఆర్య వైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు మాశెట్టి అనంతరాములు

తిరుమలగిరి, నవంబరు 6: ఆర్య వైశ్య కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ఆర్య వైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు మాశెట్టి అనంతరాములు డిమాండ్‌ చేశారు. ఆదివారం తిరుమలగిరిలోనిఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు ఇమ్మడి సోమనర్సయ్య అధ్యక్షతన నిర్వహించిన జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీ మేరకు ఆర్య వైశ్య కార్పొరేషన్‌ను సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేయడంతో పాటు, ఆర్య వైశులకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలన్నారు. ఆర్యవైశ్య పేదలను ఆదు కోవడానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలన్నారు. ఆర్యవైశ్యులు ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ప్రధా న కార్యదర్శి బండారు రాజా, కోశాధికారి తెల్లాకుల వెంకటేశ్వర్లు, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మీలా వంశీ, రాంబాబు, పాలెపు చంద్రశేఖర్‌, సామ ఆంజనేయులు, రాజు, పురుషోత్తం, గుండా రమేష్‌, శ్రీనివాస్‌, పాల్గొన్నారు.

Updated Date - 2022-11-07T01:59:39+05:30 IST

Read more