కేసీఆర్‌ కుటుంబ పాలనకు చరమగీతం

ABN , First Publish Date - 2022-05-14T05:51:13+05:30 IST

ప్రజా సంగ్రా మ యాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లోని తుక్కుగూడలో నిర్వహిస్తున్న బహిరంగ సభతో కేసీఆర్‌ కుటుంబ పాలనకు చరమగీతం పాడతామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు.

కేసీఆర్‌ కుటుంబ పాలనకు చరమగీతం
బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివా్‌సగౌడ్‌

 బీజేపీ రాష్ట్ర కార్యదర్శి  శ్రీనివా్‌సగౌడ్‌ 

నల్లగొండ, మే 13: ప్రజా సంగ్రా మ యాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లోని తుక్కుగూడలో నిర్వహిస్తున్న బహిరంగ సభతో కేసీఆర్‌ కుటుంబ పాలనకు చరమగీతం పాడతామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. శుక్రవా రం పట్టణంలోని పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో చేపట్టి న ప్రజాసంగ్రామ యాత్ర 300 కిలోమీటర్లు సాగిందని, యాత్ర ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమితషా హాజరవుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గం నుంచి వేలాది మంది కార్యకర్తలతో తరలివెళ్లనున్నట్లు వెల్లడించారు. బీజేపీ చర్రితలో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో నడుస్తున్న దొ రల గడీల, నిరంకుశల పాలన చరమగీతానికి ఈ బహిరంగ సభ నాంది పలుకుతుందన్నారు. కాంగ్రె్‌సకు సరైన నాయకత్వం లేదని, ప్రధాన ప్రతిపక్షంగా ఎమ్మెల్యేలను గెలిపిస్తే పార్టీ ఫిరాయించారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కూడా ప్రజలు డబుల్‌ ఇంజన సర్కార్‌ను కోరుకుంటున్నారని తెలిపారు. బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ బండారు ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రతీ బూత నుంచి కార్యకర్తలు తరలిరానున్నట్లు తెలిపారు. నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న రెడ్డి హాస్టల్‌ నుంచి భారీ కాన్వాయ్‌గా బయల్దేరి వెళ్లనున్నట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షు డు మొరిశెట్టి నాగేశ్వర్‌రావు, ఎస్సీ మోర్చా కార్యదర్శి పోతెపాక సాంబయ్య తదితరులు ఉన్నారు. 

Read more