ఘనంగా ధ్వజారోహణ ఉత్సవం
ABN , First Publish Date - 2022-05-14T06:27:41+05:30 IST
జిల్లా కేంద్రంలోని శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు శుక్రవారం ధ్వజారోహణ మహోత్సవాన్ని నిర్వహించారు.
సూర్యాపేట కల్చరల్, మే 13: జిల్లా కేంద్రంలోని శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు శుక్రవారం ధ్వజారోహణ మహోత్సవాన్ని నిర్వహించారు. వేకువజామునే ధ్వజారోహణం ఉత్స వాన్ని ఆలయ అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు నిర్వహించి, సంతానంలేని దంపతులకు గరుడముద్ద ప్రసాదం అందజేశారు. యాగశాలలో అగ్నిప్రతిష్ఠ, ద్వార, తోరణ, ధ్వజ, కుంభ ఆరాఽ దనలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలతో బలిహరణ నిర్వహించారు. అనంతరం భక్తులకు తదియారాధన, అన్నదానం నిర్వహించారు. సాయంత్రం వేళలో దేవతా ఆహ్వానాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఏవో శ్రీనివాస్‌రెడ్డి, అర్చకులు హరిచరణ్, రామానుజ, మురళి, నర్సింహాచార్యులు, ఆండాళ్‌గోష్ఠి భక్త బృందం పాల్గొంది.

