ఇరవై నెలల్లో 16 ద్విచక్ర వాహనాలు చోరీ

ABN , First Publish Date - 2022-05-14T06:09:55+05:30 IST

కూలీ డబ్బులు జల్సాలకు సరిపోక పోవడంతో ఓ యువకుడు బైక్‌ల దొంగగా మారాడు.

ఇరవై నెలల్లో 16 ద్విచక్ర వాహనాలు చోరీ
నిందితుడితో మిర్యాలగూడ పోలీసులు

 జల్సాలకు డబ్బులు సరిపోక దొంగగా మారిన యువకుడు

మిర్యాలగూడ అర్బన, మే 13: కూలీ డబ్బులు జల్సాలకు సరిపోక పోవడంతో ఓ యువకుడు బైక్‌ల దొంగగా మారాడు. ఏడాదిన్నర కా లంలో 16 బైక్‌లను చాకచక్యంగా చో రీ చేశాడు. పోలీసుల వాహన తనిఖీ ని గమనించి పారిపోతూ పట్టుబడ్డా డు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను మిర్యాలగూడ వనటౌన పోలీ్‌సస్టేషనలో డీఎస్పీ వెంకటేశ్వరరావు విలేకరులకు శుక్రవారం వెల్లడించారు. మ హబూబ్‌నగర్‌ జిల్లా నెల్లికుదురు మండలం రాజులకొత్తపల్లి గ్రామానికి చెందిన దర్శనపు వినోద్‌ స్వగ్రామంలో కూలీ పనులు చేసుకుంటూనే జల్సాలకు అలవాటు పడ్డా డు. అయితే దినసరి వచ్చే కూలీ డబ్బులు జల్సాలకు సరిపోకపోవడంతో బైక్‌ దొంగతనాలకు సిద్ధపడ్డాడు. దీంతో 2020 సెప్టెంబరు నుంచి సూర్యాపేట జిల్లాతో పాటు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణాల్లో సంచరిస్తూ జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో హ్యాండిల్‌ లాక్‌ చేయకుండా పార్క్‌ చేసిన బైక్‌లను లక్ష్యంగా చేసుకుని చా కచక్యంగా చోరీ చేసేవాడు. వీటన్నింటినీ ఇతర ప్రాంతాల్లో విక్రయించి, వచ్చిన సొ మ్ములతో జల్సా చేసేవాడు. ఇలా ఏడాదిన్నర కాలంలో 16 బైక్‌లను చోరీ చేశాడు. వి నోద్‌ చేసిన బైక్‌ చోరీలకు సంబంధించి సూర్యాపేట వనటౌన పోలీ్‌సస్టేషన పరిధిలో 8 కేసులు, మిర్యాలగూడ వనటౌన 6, టూటౌన 1, రూరల్‌ స్టేషనలో ఒక కేసు నమో దైంది. ఇదిలా ఉంటే శుక్రవారం ఉదయం మిర్యాలగూడ మండలం తడకమళ్ల ఎక్స్‌రో డ్డు వద్ద మిర్యాలగూడ వనటౌన పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ఏపీ24ఎజడ్‌ 0800 నెంబరు గల బైక్‌పై ఓ వ్యక్తి పోలీసులకు చిక్కకుండా వే గంగా పారిపోయాడు. అతడిని వెంబడించిన పోలీసులు కొంతదూరంలో పట్టుకున్నా రు. ఈ సందర్భంలో సదరు వ్యక్తి అనుమానాస్పదంగా వ్యవహరించడంతో అదుపులో కి తీసుకుని విచారించినట్లు డీఎస్పీ తెలిపారు. విచారణలో వినోద్‌ తన వివరాలతో పాటు ఇరవై నెలల వ్యవధిలో సూర్యాపేట పట్టణంలో 8, మిర్యాలగూడలో 8 బైక్‌లను దొంగిలించినట్లుగా నేరం ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడి నుంచి సుమారు రూ.8 లక్షల విలువైన 16 బైక్‌లు, ఒక సెల్‌ఫోనను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. దొంగను పట్టుకొని పలు కేసులను ఛేదించిన వనటౌన సీఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐ సుధీర్‌కుమార్‌, హెచసీ వెంకటేశ్వర్లు, పీసీలు నాగరాజు, రవి, వెంకటేశ్వర్లును ఎస్పీ రెమారాజేశ్వరి, డీఎస్పీ వెంకటేశ్వరరావు అభినందించారు.


Read more