సాయం కోరిన ఎంపీ కోమటిరెడ్డి.. సరేనన్న సోనూసూద్‌

ABN , First Publish Date - 2022-05-14T08:37:08+05:30 IST

సాయం కోరిన ఎంపీ కోమటిరెడ్డి.. సరేనన్న సోనూసూద్‌

సాయం కోరిన ఎంపీ కోమటిరెడ్డి.. సరేనన్న సోనూసూద్‌

  • ప్రమాదంలో చేతిని కోల్పోయిన వ్యక్తి కోసం..


హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): ప్రమాదంలో చేతిని కోల్పోయిన వ్యక్తికి సాయం చేయాలంటూ సినీ నటుడు సోనూసూద్‌కు కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. తన పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన సాయినాథ్‌ అనే వ్యక్తి.. ఓ ప్రమాదంలో తన చేతిని కోల్పోయారని, ఆయనకు తగిన సాయం చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్విటర్లో విజ్ఞప్తి చేయగా.. దీనిపై శుక్రవారం సోనూసూద్‌ స్పందించారు. కోమటిరెడ్డివిజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నామని, త్వరలోనే సాయినాథ్‌కు తాము కొత్త జీవితాన్ని అందిస్తామని ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.Read more