ఇనుగుర్తిని మండలం చేయకపోతే ఓట్లడగ..

ABN , First Publish Date - 2022-05-15T05:19:20+05:30 IST

ఇనుగుర్తిని మండలం చేయకపోతే ఓట్లడగ..

ఇనుగుర్తిని మండలం చేయకపోతే ఓట్లడగ..
క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌

  మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌

మహబూబాబాద్‌, మే 14 (ఆంధ్రజ్యోతి) :  కేసముద్రం మండలంలో ఉన్న ఇనుగుర్తి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయకపోతే ఆ ఊరికి వెళ్లి ఓటు అడగనని స్థానిక ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నా లుగు మండలాల ఎంపీటీసీలు, జడ్పీటీలు, సర్పంచులు, మండల పార్టీ అధ్యక్షులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా   శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ.. ఇనుగుర్తిని మండలంగా ఏర్పాటు చేయడం కోసం అన్ని ప్రతిపాదనలను సీఎం దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పారు. ఇనగుర్తిని మండలంగా ఏర్పాటు  చేసిన తర్వాతనే ఓటు అడిగేందుకు ఆ గ్రామానికి వెళ్తానని స్పష్టం చేశారు. ఽనారా యణ పురం రైతుల భూ ము లు ధరణిలో అటవీ భూములుగా నమోదవడంతో ఆ రైతులకు పట్టాదా రు పాస్‌పుస్తకాలు మంజూరు కావడం లేదని, త్వర లోనే ఆ సమస్యను కూడ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ, కాం గ్రెస్‌ పార్టీలు చెబుతున్న మాయమాటలను ప్రజలు నమ్మరని చెప్పారు.  గిరిజనుల రిజర్వేషన్‌పై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే ఇప్పటి వరకు వాటిని పరిశీలించిన దాఖలాలు లేవని అన్నారు. మహబూబాబాద్‌ నియోజకవర్గ అభివృద్ధితో పాటు గ్రామాల్లోని లింకురోడ్ల మరిన్ని నిధుల ను సీఎం కేసీఆర్‌ మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. గ్రా మాల్లో ఎక్కడెక్కడ లింకురోడ్లు ఉన్నాయో.. వాటి ప్రతిపాదనలు త్వరిత గతిన అందించాలని సర్పంచులకు సూచించారు.  సమీక్ష సమావేశంలో జడ్పీటీసీలు లూనా వత్‌ ప్రియాంక, రావుల శ్రీనాథ్‌రెడ్డి, మేకపోతుల శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తేళ్ల శ్రీనివాస్‌, లూనావత్‌ అశోక్‌నాయక్‌, సంద వీరన్న, యాకూబ్‌రెడ్డి, ఇస్లావత్‌ కవిత, సర్పంచులు, ఎంపీటీసీలు, ఐటీడీఏ డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. 


 

Read more