ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ సాధ్యం కానిది: మంత్రి Talasani

ABN, First Publish Date - 2022-05-07T20:43:03+05:30

వరంగల్ సభలో రాహుల్ గాంధీ ప్రకటించిన డిక్లరేషన్ ఆచరణ సాధ్యం కానిదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని Srinivas yadav అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హైదరాబాద్: వరంగల్ సభలో రాహుల్ గాంధీ ప్రకటించిన డిక్లరేషన్ ఆచరణ సాధ్యం కానిదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని Srinivas yadav అన్నారు. శనివారం TRSLP లో MLC ప్రభాకర్, MLA లు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ డిక్లరేషన్ రాష్ట్రానికి సంబంధించిందా?, దేశానికి సంబంధించిందా స్పష్టత లేదని అన్నారు.రాష్ట్ర బడ్జెట్ ఎంత? హామీల అమలుకు అయ్యే ఖర్చు ఎంత? రాహుల్ గాంధీ పార్ట్ టైం పొలిటీషియన్ అని ఎద్దేవా చేశారు.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే వ్యవసాయం లాభసాటిగా మారిందన్నారు.60 సంవత్సరాలు అధికారంలో ఉన్న మీరు ఏం చేశారో చెప్పగలరా?నిజంగా రైతులపై ప్రేమ ఉంటే ఢిల్లీలో రైతులకు మద్దతుగా ధర్నా చేస్తే ఎక్కడికి పోయారని ప్రశ్నించారు.పదే పదే తెలంగాణ రాష్ట్రం ఇచ్చామని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు.KCR నాయకత్వంలో ప్రజలు చేసిన పోరాటానికి తలొగ్గి  తెలంగాణ రాష్ట్రం ఇచ్చారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.కేంద్రం తీసుకొచ్చిన నల్లచట్టాలను రైతుల పోరాటంతోనే వెనక్కు తీసుకొంది.తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించింది.ఢిల్లీ నుండి నేతలు రాష్ట్రానికి టూరిస్ట్ లుగా వచ్చి వెళుతున్నారు.వారితో ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!