దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ: KTR

ABN , First Publish Date - 2022-05-14T19:30:36+05:30 IST

దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ అన్నారు.

దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ: KTR

నల్గొండ: దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... రాబోయే 10-15 ఏళ్లలో ఢిల్లీ కంటే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ మహానగరం దేశానికే ఒక దిక్సూచి అని చెప్పుకొచ్చారు. దేశంలో మహానగరాలకు ఎక్కడైనా ప్రతికూల పరిస్థితులున్నాయని అన్నారు. పలు కారణాలతో చాలా నగరాల్లో ఇబ్బందులున్నాయని తెలిపారు. కొన్ని నగరాల్లో రైలు ట్యాంకర్లతో నీటిని తెచ్చుకునే పరిస్థితి ఉందన్నారు. కాలుష్యం, ట్రాఫిక్‌ సమస్యలు ఇతర నగరాల్లో కూడా ఉన్నాయని మంత్రి అన్నారు. కేవలం హైదరాబాద్‌కు మాత్రమే ప్రతిదీ అనుకూల పరిస్థితి అని వెల్లడించారు. గతంలో జలమండలి ముందు ఖాళీ బిందెలతో ధర్నాలు చేసేవారన్నారు. రూ.1,450 కోట్లతో కృష్ణా నీటిని అదనంగా తరలించే కార్యక్రమం చేపట్టామని... వచ్చే వేసవి వరకు ప్రాజెక్టు పూర్తి అవుతుందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. 

Read more