ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

వ్యర్ధాలనుండిఅద్భుతాలుసృష్టించొచ్చు: మంత్రి జగదీశ్ రెడ్డి

ABN, First Publish Date - 2022-05-03T00:59:50+05:30

వ్యర్ధాలు ఎప్పటికీ వృధా కాబోవు అని వాటినుండి అద్భుతాలు సృష్టించొచ్చు అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

సూర్యాపేట: వ్యర్ధాలు ఎప్పటికీ వృధా కాబోవు అని వాటినుండి అద్భుతాలు సృష్టించొచ్చు అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. వృధా అనుకున్న వస్తువుల గురించి ఒక్కసారి లోతుగా అధ్యయనం చేయగలిగితే అదే మరో వస్తువుకు ముడి సరుకుగా మారుతుందని ఆయన తెలిపారు. సూర్యాపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల నుండి తయారు చేసిన ఆక్యుపేజర్ బోర్డ్స్,ఇటుకలు,టైల్స్ ను మంత్రి జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు. వ్యర్థం అనుకున్న దాంట్లో నుండి అద్భుతాలు సృష్టించిన సూర్యాపేట పురపాలక సంఘాన్ని ఆయన అభినందించారు. 


ఇప్పటికే వాడి పారేసిన ప్లాస్టిక్ కవర్లను రీ-సైక్లింగ్ చేస్తున్న సూర్యాపేట మున్సిపాలిటీ ఆ ముద్దలను హెచ్ డి పి యి పైప్ ల తయారీకి అమ్మి ఆదాయం సమకూర్చుకోవడం అభినందనీయమన్నారు.ఇప్పుడు తాజాగా మరో అద్భుతాన్ని సృష్టించిన సూర్యాపేట పురపాలక సంఘం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లతో ఆక్యుపేజర్ బోర్డ్స్,ఇటుకలు,టైల్స్ తయారు చేయడం స్వాగతిస్తున్నామన్నారు.యింకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, కమిషనర్ రామంజుల్ రెడ్డి,స్వచ్ఛ సర్వేక్షన్ అంబాసిడర్ పెద్ది రెడ్డి గణేష్, కౌన్సిలర్ లు చింతల పాటి భరత్ మహాజన్ ,ఎస్.కె.తాయెర్,బండారు రాజా,మున్సిపల్ డి.ఇ సత్యరావు,సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్,బండి జనార్దన్ రెడ్డి,రాజిరెడ్డి,ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ శివ ప్రసాద్,ఎస్.ఎస్.ఆర్.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!