ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

నాణ్యమైన కోచింగ్ అందించేందుకు Bc study circles సర్వం సిద్దం

ABN, First Publish Date - 2022-05-06T21:18:45+05:30

బీసీ ఆత్మగౌరవ భవనాలకు సంబందించి ఏక సంఘాలుగా ఏర్పడి నిర్మాణాలు చేసుకోవడానికి బీసీ కుల సంఘాలకు ఈ నెల 14వ తారీకు వరకు తుది గడువు ఉంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి Gangula kamalakar వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హైదరాబాద్: బీసీ ఆత్మగౌరవ భవనాలకు సంబందించి ఏక సంఘాలుగా ఏర్పడి నిర్మాణాలు చేసుకోవడానికి బీసీ కుల సంఘాలకు ఈ నెల 14వ తారీకు వరకు తుది గడువు ఉంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి Gangula kamalakar వెల్లడించారు. ఇదే అంశంపై శుక్రవారం ఉన్నతాధికారులతో హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు, రాష్ట్ర రాజదాని నడిబొడ్డున వేల కోట్ల విలువైన స్థలాల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించారని, బీసీల ఆత్మగౌరవం ఇనుమడించేలా వీటి నిర్మాణాలు చేపట్టడం కోసం 82 ఎకరాలు 96 కోట్లు కేటాయించామని, వీటిని నిర్మించుకోవడానిక ఏక సంఘంగా ముందుకు వచ్చిన బీసీ సంఘాలకే నిర్మాణ బాధ్యతలు సైతం అప్పగిస్తున్నామన్నారు. 


ఇందుకోసం ఇప్పటికే పలు దఫాలుగా బీసీ సంఘాలతో సమావేశాలు నిర్వహించామని, ఇప్పటివరకూ 18 సంఘాలు ఎక సంఘంగా ఏర్పడ్డాయని ఈనెల 14 వరకూ మిగతా సంఘాలు ఏక సంఘంగా ఏర్పడి ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకోవడానికి తుది అవకాశం ఇస్తున్నామని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీ సంఘాలకు పిలుపునిచ్చారు. ఏక సంఘంగా రాని వాటిపై గడువు తర్వాత 15 వ తారీకు నుండి ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలను ప్రభుత్వం చేపడుతుందని వెల్లడించారు

.

ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా నియమించబోయే 80039 ఉద్యోగాల భర్తీలో బీసీ స్టడీ సర్కిళ్లు నిరుద్యోగులకు అత్యుత్తమ శిక్షణను ఇస్తాయని, ఇప్పటికే గ్రూప్ 1 కోచింగ్ ప్రారభమైందని, ఎస్సై, కానిస్టేబుల్ కోచింగ్ త్వరలోనే ప్రారంబిస్తామని, నోటిఫికేషన్లు విడుదలైన ప్రకారం ఆయా పోస్టుల కోచింగ్ని అందిస్తామన్నారు. మహాత్మా జ్యోతిభాపూలే గురుకులాల్లోనూ రాబోయే విద్యాసంవత్సరానికి సంబందించి అన్ని ప్రణాళికలు సిద్దం చేసి నాణ్యమైన విద్యను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి గంగుల.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఎంజేపీ స్కూల్స్ సెక్రటరీ మల్లయ్య బట్టు, బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు అలోక్ కుమార్, సంద్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!