ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

గ్రామాలన్నీ గంగదేవిపల్లి తరహాలో అభివృద్ధి

ABN, First Publish Date - 2022-05-14T05:56:51+05:30

గ్రామాలన్నీ గంగదేవిపల్లి తరహాలో అభివృద్ధి

మండల సభలో మాట్లాడుతున్న మంత్రి దయాకర్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఐదవ విడత ‘పల్లెప్రగతి’ని సక్సెస్‌ చేయాలి

విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యం

ప్రజాప్రతినిఽధులు అందుబాటులో ఉండాలి

మండల సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

పాలకుర్తి, మే 13: రాష్ట్రంలోని అన్ని గ్రామాలు గంగదేవిపల్లి తరహాలోనే అభివృద్ధి చెందుతున్నాయని, అందుకే కేంద్ర ప్రభుత్వం 20 గ్రామాలకు అవార్డులు అందజేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. పాలకుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ నల్ల నాగిరెడ్డి అధ్యక్షత వంహించగా ముఖ్య అతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో నాలుగు విడతలుగా నిర్వహించిన ‘పల్లెప్రగతి’ కార్యక్రమంలో సాధించిన ఫలితాలు ఇప్పుడు ప్రజల అనుభవంలోకి వస్తున్నాయని తెలిపారు. ఫలితంగా గ్రామాలన్నీ ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. దేశంలో 20 ఉత్తమ గ్రామపంచాయతీలను ఎంపిక చేస్తే 19 గ్రామాలు తెలంగాణ రాష్ర్టానికి చెందినవే ఉన్నాయని చెప్పారు. దేశంలో మొదటి 19 గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా నిలిచాయని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూపొందించి అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమమే ఇందుకు కారణమని మంత్రి పేర్కొన్నారు. ఇదే తరుణంలో ఐదో విడత కూడా చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీటీసీ, వార్డు సభ్యులపై ఉందన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని సూచించారు. 

రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. అందులో భాగంగా ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం కింద రూ.7,280 కోట్లు మంజూరి అయినట్లు తెలిపారు. మూడు విడతలుగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇందులో గ్రామస్థులు, పూర్వ విద్యార్థులు, ఎన్‌ఆర్‌ఐలు, స్వచ్ఛంద సేవా సంస్థలు అందరిని భాగస్వాములను చేస్తూ సర్కార్‌ బడుల రూపురేఖలు మార్చి ధనికుల పిల్లలు కూడా చదివేలా అభివృద్ధి పరచాలని సూచించారు. అలాగే వైద్య రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో పని చేస్తుందని అన్నారు. ఇందులో భాగంగా జనగామకు మెడికల్‌ కళాశాల ఇచ్చిందన్నారు. గ్రామాల్లో ఉన్న ప్రతి ప్రభుత్వ దవాఖానాలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ 24 గంంటల పాటు ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జడ్పీటీసీ  శ్రీనివాసరావు, మార్కెట్‌ చైర్మన్‌ రాంబాబు, ఎంపీడీవో అశోక్‌కుమార్‌, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు మదార్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!