రాహుల్ బోగస్ మాటలను రైతులు నమ్మరు: మంత్రి Errabelli

ABN , First Publish Date - 2022-05-07T20:27:52+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బోగస్ మాటలను రైతులు నమ్మే స్ధితిలోలేరని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

రాహుల్ బోగస్ మాటలను రైతులు నమ్మరు: మంత్రి Errabelli

హన్మకొండ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బోగస్ మాటలను రైతులు నమ్మే స్ధితిలోలేరని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే రైతులకు అనేక పధకాలు అమలు జరుగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ సభలో Rahul చేసిన వ్యాఖ్యలపై శనివారం మంత్రి ఎర్రబెల్లి హన్మకొండలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రుణ మాఫీ చేశారా..? మీరు అధికారం వున్నప్పుడు రైతు బంధు, రైతు బీమా ఎందుకు ఇవ్వలేదు..?అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉపాధిహామీ పతాకాన్ని వ్యవసాయనాయికి ఎందుకు అనుసంధానం చేయలేదని అడిగారు. 


పంటలకు గిట్టుబాటు ధర మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదు?మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ధాన్యం కొనకపోవడం వల్లే తెలంగాణకు తీసుకువచ్చి అమ్ముకుంటున్నారని చెప్పారు.చెరుకు పరిశ్రమలు మూసేసింది కాంగ్రెస్ పార్టీ కాదా..?పోడు భూముల సమస్య తలెత్తింది కాంగ్రెస్ పాలనలోనే. ధరణి ఒక సక్సెస్ స్కీంఅని నకిలీ విత్తనాల సృష్టికర్తలే మీరేనని ఆరోపించారు. రైతులను మోసం చేసే బోగస్ సభ ఇది...సిగ్గులేకుండా రైతులను తప్పుడు హామీలతో మోసం చేస్తున్నారని విమర్శించారు. 


కాంగ్రెస్ తో పొత్తుకు ఎవరూ సిద్ధంగా లేరు.ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి.. మీ పతనం ఖాయం.మీరు వచ్చి కాళ్లు పట్టుకున్నా మిమ్మల్ని ఎవరు నమ్మరని అన్నారు. కాంగ్రెస్ దేశానికి చేసిందేమీ లేదు.. కేవలం స్వతంత్రం తెచ్చిన కుటుంబమని మీకు పాలించే స్వేచ్ఛ ఇచ్చారు.తెలంగాణ కు స్వతంత్రం తెచ్చిన మహానుబావుడు కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏనాడో చచ్చు పడిందని,కాంగ్రెస్ మోసపు, బోగస్ హామీలు 70 ఏండ్ల పాటు రైతులను మోసం చేసిందని విమర్శించారు. 

Read more