ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

జనగామ Outer ring road,నెల్లుట్ల ఫ్లై ఓవర్ మీద Accident

ABN, First Publish Date - 2022-05-04T20:32:16+05:30

జనగామ సమీపంలోని అవుటర్ రింగ్ రోడ్డు నెల్లుట్ల ఫ్లైఓవర్ మీద బుధవారం ఉదయం యాక్సిడెంట్ జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు టూ వీలర్స్ ఢీకొన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

జనగామ: జనగామ సమీపంలోని అవుటర్ రింగ్ రోడ్డు నెల్లుట్ల ఫ్లైఓవర్ మీద బుధవారం ఉదయం యాక్సిడెంట్ జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు టూ వీలర్స్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆ వాహనాలపై ప్రయాణం చేస్తున్న యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా జనగామ జిల్లా పర్యటనలో భాగంగా అదే దారిలో వెళుతూ ఈ ఘటనను చూసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన కాన్వాయ్ ని ఆపారు. వెంటనే డీసీపీ, పోలీస్ లకు ఫోన్ చేసి సహాయక చర్యలు చేపట్టారు. ఈ లోగా చుట్టుముట్టు ప్రజలు చేరారు. వారి సహాయంతో గాయపడిన వారిని పక్కన కూర్చోపెట్టారు. ఈ లోగా ఘటన స్థలానికి పోలీస్ లు చేరారు. పోలీస్ లను చూసిన వెంటనే ఇద్దరు యువకులు అక్కడి నుండి పరార్ అయ్యారు. 


అనుమానం వచ్చిన పోలీసులు పట్టుబడిన యువకుడిని విచారించారు. అతడి వద్ద ఉన్న సంచులను చెక్ చేశారు. అందులో గంజాయి ఉన్నట్లు తేలింది. దీంతో పోలీసులు ఆ యువకుడిని పట్టుకుని స్టేషన్ కి తీసుకెళ్లారు. గాయపడిన యువకులను జనగామ హాస్పిటల్ కి పంపించారు. కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.కాగా, ఘటన జరిగిన వెంటనే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించి తమకు ఫోన్ చేయడం వల్ల సహాయక చర్యలు అందడమే గాక, గంజాయి పట్టుబడి, సరఫరా చేస్తున్న ముఠా కూడా దొరికిందని, మంత్రి Errabelli Dayakar rao కి పోలీసు అధికారులు, ధన్యవాదాలు తెలిపారు. 


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యాదృచ్ఛికంగా జరిగిన ఘటనలో గంజాయి పట్టుబడటం ఆశ్చర్యంగా, ఆందోళన గా ఉందన్నారు. అందులోనూ యువకులు పట్టుబడటం చూస్తే, ఇబ్బందిగా ఉందన్నారు. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడటం మంచిది కాదని, ఎంతో భవిష్యత్తు ఉన్న వాళ్ళు మంచి దారిలో పయనించాలని అన్నారు. పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి మత్తు పదార్థాల వినియోగాన్ని, సరఫరా ను అరికట్టాలని అదేశించారు. తనతో సహాయక చర్యల్లో పాలు పంచుకున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!