యాదాద్రి జిల్లాలో మధ్యరాతియుగంచిత్రాలు

ABN , First Publish Date - 2022-05-14T09:28:18+05:30 IST

యాదాద్రి - భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం, యావపూర్‌ గ్రామపంచాయితీ పరిధిలోని మధిర గ్రామం కాశీపేటలో ఒక చిన్నరాతి గుట్టమీద .....

యాదాద్రి జిల్లాలో మధ్యరాతియుగంచిత్రాలు

కనుగొన్న కొత్త తెలంగాణ చరిత్ర బృందం

హైదరాబాద్‌ సిటీ, మే13 (ఆంధ్రజ్యోతి) : యాదాద్రి - భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం, యావపూర్‌ గ్రామపంచాయితీ పరిధిలోని మధిర గ్రామం కాశీపేటలో ఒక చిన్నరాతి గుట్టమీద  పది వేల ఏళ్లకుపైబడిన మధ్యరాతియుగం చిత్రాలను గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ శుక్రవారం తెలిపారు. వాటిని మొదట తమ బృందం సభ్యులు  మహమ్మద్‌ నజీర్‌, కొరివి గోపాల్‌ గుర్తించారని  చెప్పారు. 30 అడుగుల ఎత్తున్న చిన్నరాతి గుట్టమీద పడిగెరాయి లోపలివైపు ఎరుపురంగులో రాతి చిత్రాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. అక్కడి గుహను  స్థానికులు వెంకటేశ్వరాలయంగా పిలుస్తారు. కొన్నేళ్లుగా పండగ లు, పర్వదినాలలో గుహ అంచులకు జాజు, సున్నం పూయడంతో రాతిచిత్రాలు మరుగునపడ్డాయని తెలిపారు. 4 అడవి దున్నలు, ఇద్దరు పురుషులు, మరొక చోట గుర్రాన్ని పోలిన జంతువుల రాతిచిత్రాలు కనిపిస్తున్నట్లు చెప్పారు. ఈ బొమ్మల్లోని రేఖల ఆధారంగా ఈ చిత్రాలు పది వేల ఏళ్ల కంటే ముందునాటి మధ్యరాతియుగానికి చెందినవిగా అభిప్రాయపడుతున్నారు. 

Read more