నీటిలో మునిగి యువకుడి మృతి
ABN , First Publish Date - 2022-05-15T05:24:02+05:30 IST
ఈతకు వెళ్లి నీటమునిగి ఓ యువకుడు మృతిచెందిన సంఘటన మండల కేంద్రమైన జగదేవ్‌పూర్‌లో శనివారం చోటు చేసుకున్నది.
జగదేవ్‌పూర్, మే, 14: ఈతకు వెళ్లి నీటమునిగి ఓ యువకుడు మృతిచెందిన సంఘటన మండల కేంద్రమైన జగదేవ్‌పూర్‌లో శనివారం చోటు చేసుకున్నది. ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం జగదేవ్‌పూర్ పట్టణానికి చెందిన నాయిని చిరంజీవి (30) గ్రామంలోనే కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం గ్రామ సమీపంలో చాకలి బావిలో ఈతకోసం తన కొడుకు రాజును తీసుకుని వెళ్లాడు. బావిలోకి దిగి ఈత కొడుతూ ప్రమాదవశాత్తు నీటి మునిగిపోయాడు. ఎంతసేపు అయినా తేలకపోవడంతో కొడుకు రాజు ఇంటికెళ్లి కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. భార్య మైసవ్వతో పాటు కుటుంబసభ్యులు బావి దగ్గకు వచ్చి చూడగా కనిపించలేదు. రాత్రి కావడంతో శనివారం ఉదయం బావిలో నీరును మోటారు సహాయంతో బయటకు పంపగా బావి అడుగులో చిరంజీవి మృతిచెంది ఉన్నాడు. వెంటనే మృతదేహాన్ని బయటకు తీశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

