చెరువులో పడి మహిళ ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-05-15T05:24:34+05:30 IST
ఆర్థిక ఇబ్బందులతో ఓ మహిళ చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నది.
వర్గల్, మే 14: ఆర్థిక ఇబ్బందులతో ఓ మహిళ చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నది. ఈ సంఘటన వర్గల్ మండలం మజీద్‌పల్లి గ్రామంలో చోటు చేసుకున్నది. బేగంపేట ఎస్‌ఐ అరుణ్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గోష్క భారతి (50) కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నది. ఆమెకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అందరి వివాహాలు అయినా కుటుంబపోషణ, వివాహాల కోసం చేసిన అప్పులు అధికం కావడంతో కొద్దిరోజుల నుంచి అప్పులు ఎలా తీర్చాలో బాధపడుతూ ఉండేదని తెలిపారు. శనివారం కొడుకులు ఇద్దరు పనులపై బయటకు వెళ్లారు. ఈ క్రమంలో భారతి గ్రామానికి సమీపంలో ఉన్న బోయినమ్మ చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నది. మృతురాలి కొడుకు వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ అరుణ్ తెలిపారు.

