కందిలో టిప్పర్ ఢీ కొని ఒకరి దుర్మరణం
ABN, First Publish Date - 2022-05-14T05:37:40+05:30
టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలకేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది.
కంది, మే 13: టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలకేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. సంగారెడ్డి రూరల్ ఎస్‌ఐ శ్రీనివా్‌సరెడ్డి వివరాల ప్రకారం.. కంది గ్రామానికి చెందిన రైతు మన్నే మాణయ్య (55) శుక్రవారం తెల్లవారుజామున పశువుల కొట్టంలోని చెత్తను పారబోయడానికి కంది-శంకర్‌పల్లి రోడ్డు అవతల ఉన్న పెంటకుప్ప వద్దకు బయలుదేరాడు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా శంకర్‌పల్లి నుంచి సంగారెడ్డి వైపుకు వేగంగా వస్తున్న ఓ టిప్పర్ మాణయ్యను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్త వల్లే చనిపోయాడంటూ మృతుడి కొడుకు మన్నే సురేష్ ఫిర్యాదు చేవాడు. ఈ మేరకు టిప్పర్ డ్రైవర్‌పై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.