బావిలో పడి యువకుడి మృతి
ABN , First Publish Date - 2022-05-14T05:39:23+05:30 IST
వ్యవసాయ బావి వద్ద స్నానం కోసం వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు.
కల్హేర్, మే 13: వ్యవసాయ బావి వద్ద స్నానం కోసం వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని మాసాన్‌పల్లి శివారులో గురువారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. కల్హేర్ మండలంలోని పోమ్యానాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తచెరువు తండాకు చెందిన నున్సావత్ రాములు(35) మాసాన్‌ల్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో స్నానం కోసం వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడి ఈత రాకపోవడంతో మరణించాడు. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు గురువారం అర్ధ రాత్రి మృతదేహాన్ని బావిలో నుంచి తీసి పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎస్‌ఐ తెలిపారు. మృతుడి ముఖంపై తీవ్ర గాయాలు ఉండటంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశామని ఎస్‌ఐ ప్రశాంత్ తెలిపారు.

