చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-05-14T05:42:19+05:30 IST

ఇరువురి ఘర్షణలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

చిన్నశంకరంపేట, మే 13: ఇరువురి ఘర్షణలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి  చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని సంగాయిపల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన శవ్వల లక్ష్మీనారాయణ (48), శవ్వల ప్రవీణ్‌ మధ్య గత నెల 29న వాగ్వాదం పెరిగి ఘర్షణకు దారి తీసింది. గొడవలో తీవ్రంగా గాయపడిన లక్ష్మీనారాయణను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో మృతి చెందాడు. మృతుడికి భార్య నిర్మల, ఇద్దరు పిల్లలు ఉన్నారు.  కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, ప్రవీణ్‌ను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ సుభా్‌షగౌడ్‌ తెలిపారు.




Read more