రాజకీయ చైతన్యంతోనే ముదిరాజ్‌ల అభివృద్ధి

ABN , First Publish Date - 2022-05-09T05:11:29+05:30 IST

రాజకీయ చైతన్యంతోనే ముదిరాజ్‌ల అభివృద్ధి సాధ్యమని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్‌ మహాభ ప్రధాన కార్యదర్శి చొప్పరి శంకర్‌ అన్నారు.

రాజకీయ చైతన్యంతోనే ముదిరాజ్‌ల అభివృద్ధి

  సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్‌ 

సంగారెడ్డిటౌన్‌, మే 8: రాజకీయ చైతన్యంతోనే ముదిరాజ్‌ల అభివృద్ధి సాధ్యమని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్‌ మహాభ ప్రధాన కార్యదర్శి చొప్పరి శంకర్‌ అన్నారు. సంగారెడ్డిలో ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ముదిరాజ్‌ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకుల మోచేతి నీళ్లు తాగే సంస్కృతికి స్వస్తి పలకాలన్నారు. విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాల్లో ప్రాధాన్యం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ పదవి పొందిన ముదిరాజ్‌కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో ముదిరాజ్‌లు పోటీ చేసేందుకు కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. ముదిరాజ్‌లకు రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని, మత్స్య కార్మికులకు పింఛన్‌ అమలుతో పాటు వారి పిల్లలకు ఉచిత విద్యను అందించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మన్‌సాన్‌పల్లి నారాయణ, మహిళా విభాగం అధ్యక్షురాలు మందుల వరలక్ష్మి, ఉమ్మడి జిల్లా డీసీసీబీ ఉపాధ్యాక్షుడు పట్నం మాణిక్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి బలిజగూడెం నగేష్‌, ఉపాద్యక్షుడు గాడిఖాన విజయభాస్కర్‌, జహీరాబాద్‌ తాలూకా అధ్యక్షుడు నారాయణ, సంగారెడ్డి, సదాశివపేట కౌన్సిలర్లు ఉదయబాస్కర్‌, సాతాని శ్రీశైలం, సదాశివపేట పట్టణ అధ్యక్షుడు గారెల తుల్జారాం, జిల్లా నాయకులు వెంకన్న, చేపల హనుమంతు, సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు చిల్వరి చంద్రశేఖర్‌, ప్రధాన కార్యదర్శి పిట్టల రమేష్‌, రాష్ట్ర మీడియా ఇన్‌చార్జి బోయిని శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు. 


 

Read more