మతోన్మాదంతో ప్రజలను రెచ్చగొడుతున్న బీజేపీ

ABN , First Publish Date - 2022-05-14T05:48:06+05:30 IST

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మతోన్మాదంతో ప్రజలను రెచ్చగొడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వీరయ్య అన్నారు.

మతోన్మాదంతో ప్రజలను రెచ్చగొడుతున్న బీజేపీ
సమావేశంలో మాట్లాడుతున్న వీరయ్య

ప్రశ్నించినవారిపై దేశద్రోహం, రాజద్రోహం కేసులు

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వీరయ్య

సంగారెడ్డి రూరల్‌, మే 13: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మతోన్మాదంతో ప్రజలను రెచ్చగొడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వీరయ్య అన్నారు. సంగారెడ్డిలోని కేవల్‌ కిషన్‌ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం హిందుత్వ ఎజెండాతో కులలు, ప్రాంతాలు, మతాల మధ్య అస్తిత్వ ఉద్యమాలు తీసుకువచ్చి రాజకీయ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే మేధావులు, కవులు, కళాకారులు, అభ్యుదయ వాదు లు, జర్నలిస్టులపై దేశద్రోహం, రాజద్రోహం అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సిపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం న్యాయవ్యవస్థలను ఈడీ, సీబీఐ సంస్థలను ఉపయోగించుకుని ప్రశ్నిస్తున్న వారిని తొక్కివేస్తూ చట్టాలను దుర్వినియోగం చేస్తున్నదని విమర్శించారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర నాయకుడు మల్లికార్జున్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల కార్యదర్శులు జయరాజ్‌, మల్లేశం, రాజయ్య, మాణిక్యం, మల్లేశం, రాంచందర్‌, నర్సింహారెడ్డి, నర్సమ్మ పాల్గొన్నారు.

Read more