నకిలీ విత్తనాలు తయారుచేస్తే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2022-05-15T05:21:29+05:30 IST
నకిలీ విత్తనాలు తయారుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ అధికారి అనిత పేర్కొన్నారు.
రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ అధికారి అనిత
ములుగు, మే, 14: నకిలీ విత్తనాలు తయారుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ అధికారి అనిత పేర్కొన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని బండమైలారం గ్రామంలో విత్తనాల కంపెనీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ఉన్న విత్తనాల ప్యాకెట్లు, రికార్డులను పరిశీలించారు. దాంతోపాటు వంటిమామిడిలోని ఫర్టిలైజర్ షాప్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని సంకల్పంతో పనిచేస్తున్నదని చెప్పారు. సీడ్ కంపెనీ, ఫర్టిలైజర్ షాపు యజమానులు నకిలీ విత్తనాలను అమ్మకూడదని, ఎవరైనా అమ్మినట్టు తెలిస్తే షాపులను సీజ్‌చేసి, లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ యాదగిరి, ములుగు వ్యవసాయ అధికారి ప్రగతి, ఏఈవో పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.

