సుల్తాన్‌పూర్ జేఎన్టీయూలో నేటి నుంచి జాతీయ సమైక్యతా శిబిరం
ABN , First Publish Date - 2022-05-14T05:52:17+05:30 IST
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్‌పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 14 నుంచి జాతీయ స్థాయి సమైక్యతా శిబిరం నిర్వహించనున్నారు.
పుల్‌కల్, మే 13: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్‌పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 14 నుంచి జాతీయ స్థాయి సమైక్యతా శిబిరం నిర్వహించనున్నారు. ఈనెల 20 వరకు కొనసాగనున్న ఈ శిబిరంలో దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి 200 మంది విద్యార్థి వలంటీర్లు, కార్యనిర్వాహక అధికారులు పాల్గొననున్నారు. జాతీయ సేవా పథకం (ఎన్‌ఎ్‌సఎస్) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో సమాజ సేవతో పాటు ఇతర స్వచ్ఛంద సేవా కార్యక్రమాల గురించి సమగ్రంగా వివరిస్తారని కళాశాల ప్రిన్సిపాల్ జీఎన్.శ్రీనివాస్ తెలిపా రు. జాతీయ స్థాయిలో నిర్వహించే సమైక్యతా శిబిరానికి సుల్తాన్‌పూర్ జేఎన్టీయూ కళాశాలను ఎంపిక చేయడంతో విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ కట్టా నర్సింహారెడ్డి, రెక్టార్ గోవర్దన్, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, కళాశాల ప్రిన్సిపాల్ జీఎన్.శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయి సమైక్యత శిబిరానికి హాజరయ్యే విద్యార్థులు, కార్యనిర్వహక అధికారులకు సమస్యలు తలెత్తకుండా అన్నీ సౌకర్యాలు ఏర్పాటు చేశామని ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారు.

