ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఉద్యోగ సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలి

ABN, First Publish Date - 2022-05-14T05:51:48+05:30

ఉద్యోగసాధనే లక్ష్యంగా యువతీ, యువకులు ముందుకు సాగాలని, మెదక్‌ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

నిత్యం 10 నుంచి 16 గంటలు తప్పక చదవాలి

వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

మెదక్‌ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని


మెదక్‌అర్బన్‌, మే 13: ఉద్యోగసాధనే లక్ష్యంగా యువతీ, యువకులు ముందుకు సాగాలని, మెదక్‌ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పిలుపునిచ్చారు. పోలీస్‌ నియామకాలకు మెదక్‌లో నిర్వహిస్తున్న ఉచిత పోలీసు శిక్షణా శిబిరాన్ని శుక్రవారం ఎస్పీ సందర్శించారు. శిక్షణ పొందుతున్న యువతీ యువకులను ఏమైనా సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ... సెల్‌ఫోన్‌, వాట్సాప్‌ చాటింగ్‌, సినిమా షికార్లకు దూరంగా ఉండాలన్నారు. మీ భవిష్యత్‌ మీ చేతుల్లోనే ఉందని, మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుందన్నారు. కష్టపడి, ఇష్టపడి చదివితే విజయం తప్పకుండా సాధిస్తారన్నారు. ప్రతి ఒక్కరూ మ్యాథ్స్‌పై పట్టుసాధించాలని సూచించారు. తరగతులు విని ఇంటికి వెళ్లిన తర్వాత ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్‌ చేయాలని చెప్పారు. వందశాతం లక్ష్యంతో పట్టుదలతో చదవాలని అఽభ్యర్థులకు సూచించారు. నెగిటివ్‌ మార్క్స్‌ ఉన్నందున ప్రతిఒక్కరూ శ్రద్ధతో ఉద్యోగ సాధన లక్ష్యంతో నిత్యం 10 నుంచి 16 గంటలు చదువుకొని జాబ్‌ సాధించాలన్నారు. ఎమ్మెల్యే సహాయ సహకారాలతో ఎంతో డబ్బు ఖర్చు చేసి శిక్షణ ఇస్తున్నామని, దీనిని యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని వెల్లడించారు. కార్యక్రమంలో మెదక్‌ డీఎస్పీ సైదులు, పట్టణ, రూరల్‌ సీఐలు మధు, విజయ్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!