పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు చర్యలు

ABN , First Publish Date - 2022-05-15T04:46:12+05:30 IST

పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు, పేలుళ్లను నివారించేందుకు సంగారెడ్డి కలెక్టర్‌ హన్మంతరావు ఆదేశాల మేరకు పరిశ్రమల తనిఖీ బృందాలను నియమించారు.

పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు చర్యలు

  సంగారెడ్డి కలెక్టర్‌ ఆదేశాలతో కమిటీ ఏర్పాటు

 ప్రతీరోజు పరిశ్రమల్లో తనిఖీల నివేదికలు


సంగారెడ్డి రూరల్‌, మే 14: ఇటీవలి కాలంలో పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు, పేలుళ్లు సర్వసాధారణమైపోయాయి. యాజమాన్యాల నిర్లక్ష్యంతో పాటు కార్మికుల అజాగ్రత్త కూడా ప్రమాదాలకు కారణమవుతున్నది. అగ్ని ప్రమాదాలు, పేలుళ్ల కారణంగా ఆస్తి నష్టంతో పాటు విధుల్లో ఉన్న కార్మికులు, ఉద్యోగులు ప్రాణాలను కోల్పోతున్నారు. పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు, పేలుళ్లను నివారించేందుకు సంగారెడ్డి కలెక్టర్‌ హన్మంతరావు ఆదేశాల మేరకు పరిశ్రమల తనిఖీ బృందాలను నియమించారు. ఈ తనిఖీ బృందంలో కర్మాగారాల తనిఖీ అధికారులు, జిల్లా పరిశ్రమల, అగ్నిమాపక, కాలుష్య నియంత్రణ మండలి, కార్మిక అధికారులు ఉంటారు. ఈ తనిఖీ బృందాలు గత ఐదేళ్లలో ప్రమాదాలు, పేలుళ్లు జరిగిన పరిశ్రమలతో పాటు ఎక్కువ శాతం ప్రమాదాలకు గురయ్యే రసాయన పరిశ్రమలు, స్టీలు తదితర పరిశ్రమల్లో తనిఖీలు చేస్తారు. పరిశ్రమ యాజమాన్యాలకు సూచనలు, సలహాలతో పాటు హెచ్చరికలు జారీ చేస్తారు. 


మండలాల వారీగా పరిశ్రమల తనిఖీ బృందాల వివరాలు


జిన్నారం మండలానికి ప్రబీణ్‌కుమార్‌(8309414622), మునిపల్లి-రవీందర్‌(8008404626), అందోల్‌-ఎస్‌.యాదయ్య(9492555304), గుమ్మడిదల-సి.రవికుమార్‌(9008331270), హత్నూర-లక్ష్మీకుమారి(9849037690), ఐడీఏ బొల్లారం- శ్రీకాంత్‌రెడ్డి(8712699383), సంగారెడ్డి-జేశన్‌(9492555274), కంది-స్వప్న(9177303255), కొండాపూర్‌-విజయ(9177303217), సదాశివపేట-వై.విద్య(9440055900), జహీరాబాద్‌-ఎం.సురేష్‌(9959333293), కోహీర్‌-బి.సచిన్‌(9346781890), అమీన్‌పూర్‌, ఆర్‌సిపురం, పటాన్‌చెరు మండలాలు, ఐడీఏ పటాన్‌చెరు, పాశమైలారం, సుల్తాన్‌పూర్‌ ప్రాంతాలకు ఎన్‌.జనాయా(8712699391) నియమితులయ్యారు. ఆయా మండలాల తనిఖీ బృందాలు రోజూ పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహిస్తారు. ప్రమాదాలు జరగకుండా ఎలాంటి  చర్యలు తీసుకున్నారనే విషయాలపై నివేదికలు రూపొందించి కలెక్టర్‌కు సమర్పిస్తారు. అంతే కాకుండా ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలపై పరిశ్రమ యాజమాన్యాలకు అవగాహన కల్పిస్తారు. 


 

Read more