ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

మామిడి మహాప్రియం

ABN, First Publish Date - 2022-05-08T05:24:56+05:30

మే నెల వచ్చిందంటే ఇళ్లల్లో మామిడి పచ్చడి పెట్టడంలో మహిళలు నిమగ్నం అవుతారు. తొక్కు మామిడి కాయలతో పాటు మిరపకాయలు, నూనెలు ఇతర పోపు వస్తువులను సమకూర్చుకుంటారు. కూరలు లేకున్నా పచ్చడితో తిని పనులకు వెళ్లే అవకాశం ఉంటుందని గ్రామీణులు దీనికి ఎంతో ప్రాధాన్యమిస్తుంటారు. అయితే ప్రస్తుతం మామిడి పచ్చడి పెట్టాలంటే జంకుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

తొక్కు తయారీకి ధరాఘాతం

 ఈసారి తగ్గిన మామిడి దిగుబడి

 సలసల కాగుతున్న వంట నూనెల ధరలు

 భగ్గుమంటున్న ఎండు మిర్చి


హుస్నాబాద్‌, మే 7: మే నెల వచ్చిందంటే ఇళ్లల్లో మామిడి పచ్చడి పెట్టడంలో మహిళలు నిమగ్నం అవుతారు. తొక్కు మామిడి కాయలతో పాటు మిరపకాయలు, నూనెలు ఇతర పోపు వస్తువులను సమకూర్చుకుంటారు. కూరలు లేకున్నా పచ్చడితో తిని పనులకు వెళ్లే అవకాశం ఉంటుందని గ్రామీణులు దీనికి ఎంతో ప్రాధాన్యమిస్తుంటారు. అయితే ప్రస్తుతం మామిడి పచ్చడి పెట్టాలంటే జంకుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా మామిడి కాయలే దొరకడం లేదు. దీనికి తోడు పచ్చడికి కావాల్సిన వస్తువుల ధరలు మండిపోతున్నాయి. 5 కిలోల మామిడి పచ్చడి పెట్టాలంటే దాదాపు రూ.3వేలకుపైగా ఖర్చవుతుంది. ఈ పౌర్ణమి తరువాత పచ్చడిల జోరు అందుకుంటుంది. కానీ ఈ సంవత్సరం ఏర్పడిన పరిస్థితులతో మక్కువ చూపడం లేదు.


ఒక మామిడి కాయకు రూ.15


గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి మామిడి కాయల దిగుబడి తగ్గిపోయింది. తొక్కు కాయల చెట్లకు సరైన సమయంలో పూత రాకపోవడంతో కాత లేకుండా పోయింది. గతంలో గ్రామాలు తిరుగుతూ పచ్చడి కాయలు అమ్మేవారు. సంతలో సైతం మామిడి కాయల విక్రయాలు జరిగేవి. ఈ సంవత్సరం డిసెంబర్‌ నుంచి ఏర్పడిన వాతవరణ పరిస్థితులతో మామిడికి గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. పిందెలు అయిన తర్వాత ఎండ వేడిమికి రాలి పోయాయి. ఇప్పటికీ కొన్ని చెట్లకు చిన్న సైజులోనే మామిడి కాయలున్నాయి. కొద్దో గొప్పో మామిడి కాయలు దొరికినా మార్కెట్‌లో రూ.15 నుంచి రూ.20 వరకు ధర పలుకుతోంది. గతంలో వంద, రెండు వందల పచ్చడి కాయలు పెట్టిన వారు ఈసారి 50 కాయలతో సరిపెట్టుకుంటున్నారు.


కిలో ఎండు మిర్చికి రూ. 250


మామిడి పచ్చడి పెట్టేందుకు వినియోగించే దొడ్డు, ఎండురకం మిర్చీల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. కిలో ఎండు మిర్చి రూ.250లకు పైగా ధర  పలుకుతున్నది. ఈ పచ్చడిలో ఎర్రగా ఉండే మిర్చిని వినియోగిస్తేనే సుమారు నాలుగైదు నెలలు నిల్వ ఉండి తాజాగా ఉంటుంది. అలాగే పల్లి నూనే ధరలకు కూడ రె క్కలు వచ్చాయి. మేలైన కిలో పల్లినూనె రూ.270 వరకు విక్రయిస్తున్నారు. ఇలా ధరలు పెరుగడంతో మామిడి పచ్చడి మహా ప్రియంగా మారింది.


 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!