కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం

ABN , First Publish Date - 2022-05-15T05:23:31+05:30 IST

కారు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన వర్గల్‌ మండలం సామల్లాపల్లి వద్ద జరిగింది.

కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం

వర్గల్‌ మండలం సామల్లాపల్లి వద్ద ఘటన

వర్గల్‌, మే 14: కారు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన వర్గల్‌ మండలం సామల్లాపల్లి వద్ద జరిగింది. బేగంపేట ఎస్‌ఐ అరుణ్‌ తెలిపిన వివరాల ప్రకారం మర్కుక్‌ మండలం చేబర్తి గ్రామానికి చెందిన గాదమల్ల బాల్‌నర్సయ్య (53) వ్యవసాయం సాగుచేయడంతో పాటు వంటలు చేస్తాడు. శనివారం ఉదయం తూప్రాన్‌లో వంటలు చేసేందుకు వెళ్లి సాయంత్రం తన ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తున్నాడు. కాగా సామల్లాపల్లి వద్దకు రాగానే గజ్వేల్‌ నుంచి ఎదురుగా వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బాల్‌నర్సయ్య తల, కాళ్లకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య భారతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ అరుణ్‌ తెలిపారు. 

Read more