కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-05-15T05:25:06+05:30 IST
కుటుంబ కలహాలతో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మిరుదొడ్డి మండలం భూంపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకున్నది.
మిరుదొడ్డి, మే 14: కుటుంబ కలహాలతో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మిరుదొడ్డి మండలం భూంపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకున్నది. భూంపల్లి ఎస్‌ఐ హరీశ్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని భూంపల్లి గ్రామానికి చెందిన కుంట లక్ష్మణ్‌కు మిరుదొడ్డి గ్రామానికి చెందిన కల్పనతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. 13న అత్తగారి ఇళ్లయిన మిరుదొడ్డిలో పోశమ్మ ఆలయం పండుగకు వెళ్లాడు. ఈ క్రమంలో అత్తగారింటి వారు లక్ష్మణ్‌ను కొట్టడంతో మనస్తాపానికి గురై శుక్రవారం రాత్రి భూంపల్లికి వెళ్లి వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం తండ్రి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చూడగా లక్ష్మణ్ ఉరేసుకుని కనిపించాడు. దీంతో ఆయన బోరున విలపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా లక్ష్మణ్ జేబులో సూసైడ్ నోట్ లభించింది. అత్తింటి వేధింపులతో పాటు తనను కొట్టడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్‌లో రాశాడు. లక్ష్మణ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

