ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

అసైన్డ్‌ భూమి రిజిస్ట్రేషన్‌ వ్యవహారంలో ఇద్దరిపై వేటు

ABN, First Publish Date - 2022-05-14T05:44:44+05:30

తూప్రాన్‌ పట్టణ పరిధి అల్లాపూర్‌ శివారులోని సర్వేనంబరు 321లోని అసైన్డ్‌భూమి రిజిస్ట్రేషన్‌ చేసిన వ్యవహారంలో ఇద్దరిపై వేటు పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

తూప్రాన్‌, మే 13: తూప్రాన్‌ పట్టణ పరిధి అల్లాపూర్‌ శివారులోని సర్వేనంబరు 321లోని అసైన్డ్‌భూమి రిజిస్ట్రేషన్‌ చేసిన వ్యవహారంలో ఇద్దరిపై వేటు పడింది. అల్లాపూర్‌ శివారులోని సర్వేనంబరు 321లో మూడు ఎకరాల భూమిని మనోహరాబాద్‌ మండలం పోతారం గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్‌ పులి కుమార్‌కు 2004లో కేటాయించింది. అసైన్డ్‌భూమిని పట్టాభూమిగా మార్చేసి గతనెల 11న తూప్రాన్‌ తహసీల్దారు కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌  చేశారు. నిషేధిత జాబితాలో ఉన్న అసైన్డ్‌భూమిని పట్టాభూమిగా మార్చేందుకు తూప్రాన్‌ తహసీల్దారు కార్యాలయం నుంచి నివేదికను పంపారు. తప్పిదం గుర్తించిన అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇందులో ఇటీవలనే తూప్రాన్‌ నయబ్‌ తహసీల్దారుగా వచ్చిన వరప్రసాద్‌ను పాపన్నపేటకు డిప్యూటేషన్‌ చేశారు. తూప్రాన్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ధరణి ఆపరేటర్‌గా పనిచేస్తున్న సుమంత్‌ను శివ్వంపేటకు పంపించారు. అక్కడ పనిచేస్తున్న బాలకృష్ణను తూప్రాన్‌ ధరణి ఆపరేటర్‌గా నియమించారు. ఇదిలా ఉండగా, మళ్లీ పట్టాభూమిని అసైన్డ్‌ భూమిగా మార్చేందుకు సీసీఎల్‌కు నివేదిక పంపినట్లుగా సమాచారం. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!