భారీ వర్షానికి కొట్టుకుపోయిన ధాన్యం

ABN , First Publish Date - 2022-05-14T05:44:10+05:30 IST

సిర్గాపూర్‌ మండలంలోని అంతర్గాం, ముబారక్‌పూర్‌, బొక్క్‌సగామ్‌, నల్లవాగు, పోచాపూర్‌, గోసాయిపల్లి గ్రామాల్లో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది.

భారీ వర్షానికి కొట్టుకుపోయిన ధాన్యం
అంతర్గాం గ్రామంలో వర్షానికి ధాన్యం కొట్టుకుపోయిన దృశ్యం

కల్హేర్‌, మే 13: సిర్గాపూర్‌ మండలంలోని అంతర్గాం, ముబారక్‌పూర్‌, బొక్క్‌సగామ్‌, నల్లవాగు, పోచాపూర్‌, గోసాయిపల్లి గ్రామాల్లో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. గాలి, వాన భీబత్సానికి మామిడి కాయలు రాలిపోగా, చేతికి వచ్చిన ధాన్యం నీటిపాలయింది. తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆయా గ్రామాల రైతులు కోరారు. 


Read more