ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రైతుల ఆగ్రహం

ABN, First Publish Date - 2022-05-15T04:48:47+05:30

ధాన్యం కొనుగోలులో జాప్యంపై వెల్దుర్తి మండలంలోని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం వెల్దుర్తిలోని ప్రాథమిక సహకార సంఘం కొనుగోలు కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు.

వెల్దుర్తిలో తడిసిన ధాన్యంతో నిరసన తెలుపుతున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

 తడిసిన ధాన్యంతో ప్రధాన రహదారిపై ధర్నా


వెల్దుర్తి, మే 14: ధాన్యం కొనుగోలులో జాప్యంపై వెల్దుర్తి మండలంలోని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం వెల్దుర్తిలోని ప్రాథమిక సహకార సంఘం కొనుగోలు కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. కొనుగోళ్లు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం నాలుగు లారీల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని మండిపడ్డారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యంతోనే మెదక్‌-వెల్దుర్తి ప్రధాన రహదారిపై బైఠాయించి రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. సంఘం చైర్మన్‌ అనంతరెడ్డి ధాన్యం కొనుగోలులో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని, మిల్లర్లతో కుమ్మక్కై డబ్బులు దోచుకుంటున్నాడని ఆరోపించారు. కొనుగోలు కేంద్రం వద్ద కనీస వసతులు లేవన్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ సురే్‌షకుమార్‌... ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆందోళనలో గోవిందరెడ్డి, కట్టెల యాదగిరి, కట్టెల రమేష్‌, శ్రీనివాస్‌, సతిరెడ్డి, రమేష్‌, లింగం, మహేష్‌ పాల్గొన్నారు.  


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!