అటవీశాఖ అధికారులపై కలెక్టర్‌కు ఫిర్యాదు
ABN, First Publish Date - 2022-05-14T05:45:16+05:30
సంగారెడ్డి జిల్లా అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హన్మంతరావుకు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ శుక్రవారం ఫిర్యాదు చేశారు.
సంగారెడ్డి టౌన్, మే 13: సంగారెడ్డి జిల్లా అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హన్మంతరావుకు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ శుక్రవారం ఫిర్యాదు చేశారు. జిన్నారం మండలం శివానగర్ శివారులోని చెల్కన్ చెరువుకు ఉన్న కట్టు కాలువను రాత్రికి రాత్రే అటవీశాఖ అధికారులు పూడ్చివేశారని ఆరోపించారు. 69 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ చెరువు కింద 160 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని తెలిపారు. గతంలో మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించిన ఈ చెరువుకు అనుసంధానంగా ఉన్న కట్టు కాలువను అటవీశాఖ అధికారులు వారం రోజులుగా పూడ్చివేస్తూ చెరువులోకి వరద నీరు రాకుండా అడ్డుకట్ట వేశారని ఆరోపించారు.