కారు బోల్తా.. ఒకరికి తీవ్ర గాయాలు
ABN , First Publish Date - 2022-05-14T05:38:17+05:30 IST
కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
అల్లాదుర్గం, మే 13: కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని ఐబీ గిరిజన తండా వద్ద 161వ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని వడ్లం గిరిజనతండాకు చెందిన తుక్కారాం హైదరాబాద్ నుంచి స్వగ్రామమైన వడ్లం గిరిజన తండాకు కారులో బయలుదేరాడు. ఈ క్రమంలో ఐబీ గిరిజన తండా సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టి బోల్తాపడింది. ఒక్క సారిగా భారీశబ్దం రావడంతో తండా వాసులు అక్కడికి చేరుకొని కారులో చిక్కుకున్న తుక్కారంను రక్షించారు. తీవ్రంగా గాయాలైన అతడిని 108 వాహనంలో జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తండా వాసులు తెలిపారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

