డివైడర్‌ను ఢీకొని ద్విచక్రవాహనదారుడి మృతి

ABN , First Publish Date - 2022-05-14T05:37:08+05:30 IST

మండల పరిధిలోని జంబికుంట శివారులోని 161వ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం బైక్‌ డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

డివైడర్‌ను ఢీకొని ద్విచక్రవాహనదారుడి మృతి

పెద్దశంకరంపేట, మే 13: మండల పరిధిలోని జంబికుంట శివారులోని  161వ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం బైక్‌ డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పేట ఎస్‌ఐ బాలరాజు వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం కర్ల గ్రామానికి చెందిన ఎర్రోళ్ల సుభాష్‌  కొంత కాలంగా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. శుక్రవారం సుభాష్‌ బైక్‌పై హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో జమ్మికుంట శివారులోకి చేరుకోగానే బైక్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో బలమైన గాయాలయ్యాయి. ఈ ఘటనలో సుభాష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరుడు బాలరాజు  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వివరించారు. 

Read more