పట్టణప్రగతిలో తూప్రాన్ మున్సిపాలిటీకి అవార్డు
ABN , First Publish Date - 2022-05-14T05:54:11+05:30 IST
తూప్రాన్ మున్సిపాలిటీలో 2021-22 సంవత్సరానికి పట్టణ ప్రగతిలో చేపట్టిన అభివృద్ధికి ‘వినూత్న మౌలిక సదుపాయాలు’ అవార్డు దక్కింది. శుక్రవారం హైదరాబాద్ ఎర్రగడ్డలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అవార్డులను ప్రదానం చేశారు.
తూప్రాన్, మే 13: తూప్రాన్ మున్సిపాలిటీలో 2021-22 సంవత్సరానికి పట్టణ ప్రగతిలో చేపట్టిన అభివృద్ధికి ‘వినూత్న మౌలిక సదుపాయాలు’ అవార్డు దక్కింది. శుక్రవారం హైదరాబాద్ ఎర్రగడ్డలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అవార్డులను ప్రదానం చేశారు. తూప్రాన్ మున్సిపాలిటీకి దక్కిన అవార్డు, సర్టిఫికెట్‌ను మున్సిపల్ కమిషనర్ టీ.మోహన్ అందుకున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవల్‌పమెంట్ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన పట్టణ ప్రగతిలో 25వేల లోపు జనాభా కేటాగిరిలో అవార్డు దక్కించుకున్నారు. అవార్డు రావడానికి కృషి చేసిన చైర్మన్ బొంది రాఘవేందర్‌గౌడ్, ఎన్విరాల్‌మెంటల్ ఇంజనీరు శ్రీకాంత్, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్, సిబ్బంది మహేశ్, వినోద్, ఇర్ఫాన్, మల్లికార్జున్, అశోక్, వెంకటేశ్‌కు కమిషనర్ ధన్యవాదాలు తెలిపారు.

