ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

road works రోడ్డు పనులు పూర్తిచేయని అధికారులపై మర్రి శశిధర్ రెడ్డి ఫిర్యాదు

ABN, First Publish Date - 2022-05-11T22:43:24+05:30

సనత్ నగర్ నియోజక వర్గంలోని న్యూ బోయిగూడ ఉప్పలమ్మ దేవాలయం నుండి వయా మేకల మండి మీదుగా న్యూ బోలక్ పూర్ మల్లికార్జున స్వామి దేవాలయం వరకు గత నాలుగు నెలలు క్రింద నూతన రోడ్డు వేయాలని నెపంతో వున్న రోడ్డును తోవ్వడముతో

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హైదరాబాద్: సనత్ నగర్ నియోజక వర్గంలోని న్యూ బోయిగూడ ఉప్పలమ్మ దేవాలయం నుండి వయా మేకల మండి మీదుగా న్యూ బోలక్ పూర్ మల్లికార్జున స్వామి దేవాలయం వరకు గత నాలుగు నెలలు క్రింద నూతన రోడ్డు వేయాలని నెపంతో వున్న రోడ్డును తోవ్వడముతో అక్కడి స్థానిక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నరన్నారు. ప్రజల ఫిర్యాదుల మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, NDMA మాజీ ఉపాధ్యక్షులు మర్రి శశిధర్ రెడ్డి(Marri shashidhar reddy) పర్యటించారు. స్థానికులు ఆ ప్రాంతము మొత్తం కంకర తేలి గుంతలు, గుంతలుగా వుండటాన్ని అదీ కాకుండా మురుగు నీరు ఆ కంకర రోడ్డు పై ప్రవహిస్తూ దుర్గంధము వెదజల్లుతున్న తీరును మర్రి శశిధర్ రెడ్డికి చూపించారు. దానితో  ఆయన జలమండలి, GHMC అధికారులకు ఫోన్ చేయడంతో ఆయా శాఖల అధికారులు అక్కడికి వెంటనే చేరుకొన్నారు. శశిధర్ రెడ్డి  మురుగునీటి గురించి  వివరణ అడిగారు. 


జలమండలి అధికారి వెంకట్ రావు రోడ్డు నిర్మాణం బాగంగా రోడ్డు కాంట్రాక్టర్ JCB తో మ్యాన్ వోల్స్ ను ద్వంసం చేయడంము , మ్యాన్ లలో ఇసుక కంకర నిండి మురుగు నీరు ముందుకు పోక రోడ్డు పై ప్రవహిస్తోందని వివరించారు. దానితో GHMC స్థానిక JEని జరిగిన దానిపై శశిధర్ రెడ్డి నిలదీసారు. ఆయన నుంచి సమాధానం రాకపోవడంతో JE పై మండిపడ్డారు. మాట్లాడుతూ రోడ్డు తొవ్వే సమయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టము వచ్చినట్లు మ్యాన్ వోల్స్ ను ద్వంసం చేసిన సదరు కాంట్రాక్టర్ చర్యలు తీసుకోవాలని అలాగే ప్రజలకు ఇబ్బందులు కల్పించిన అతనిని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని శశిధర్ రెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. శశిధర్ రెడ్డియూత్ కాంగ్రెస్ నాయకులు మర్రి పురురవ రెడ్డి , స్థానిక డివిజన్ అధ్యక్షులు గుంటి సత్యనారాయణ , అంబాలా ఈశ్వర్  పుట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!