ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

సక్రమంగా విధులు నిర్వహించాలి

ABN, First Publish Date - 2022-05-07T05:28:57+05:30

విద్యుత్‌ అధికారులు విధులను సక్రమంగా నిర్వహించాలని, లేకపోతే ఉద్యోగాలు మా నుకొని ఇంట్లో కూర్చోవాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత హెచ్చరించారు.

స్థాయీ సంఘం సమావేశంలో అధికారితో మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

- లేకపోతే ఉద్యోగాలు మానుకోవాలి

- స్థాయీ సంఘం సమావేశంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత

గద్వాల, మే 6 : విద్యుత్‌ అధికారులు విధులను సక్రమంగా నిర్వహించాలని, లేకపోతే ఉద్యోగాలు మా నుకొని ఇంట్లో కూర్చోవాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత హెచ్చరించారు. అంతేకాని ప్రజలను ఇబ్బందు లకు గురి చేయడం మంచిది కాదని హితవు పలికారు. తన చాంబర్‌లో శుక్రవారం ఏడవ స్థాయీ సంఘం సమావేశం నిర్వహించారు. విద్యుత్‌శాఖపై సమీక్ష సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల్లో ఏఈలు సక్రమంగా పనిచేయడం లేదని, సమస్య వస్తే స్పందించడం లేదని విమర్శించారు. విద్యుత్‌ స్తంభాలు, వాటికి తీగలు లేవని అన్నారు. ట్రాన్ప్‌ఫార్మర్లకు కంచె ఏర్పాటు చేయాలని సూచిం చారు. రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరులో మార్పు రాకపోతే సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం పంచాయతీరాజ్‌, మిషన్‌ భగీరథ, ఆర్‌అండ్‌బీ శాఖలపై సమీక్షించారు. రోడ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. గద్వాల - అయిజ రోడ్డుకు మరమ్మతు చేపట్టాలన్నారు. జిల్లా కార్యాలయ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందని ప్రశ్నించారు. జూలై నాటికి పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. ఆర్డీఎస్‌ కాలువ డీ-24 నుంచి 40 వరకు పూడిక పేరుకుపోయిందని, దానిని తొలగించా లని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ సరోజమ్మ, సీఈవో విజయానాయక్‌, జడ్పీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


వాల్మీకులకు అండగా ప్రభుత్వం

వాల్మీకులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు. గద్వాల మండలం లోని రేపల్లి గ్రామంలో శుక్రవారం వాల్మీకీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ సరిత, వైస్‌ చైర్‌పర్సన్‌ సరోజమ్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వాల్మీకీ మహర్షికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత మాట్లాడుతూ వాల్మీకుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఈ సందర్భంగా వాల్మీకీ సంఘం నాయకులు ముఖ్య అతిథులతో పాటు, రమేష్‌నాయుడు, కౌన్సిలర్లు మురళీ, కోటేష్‌లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచు విజయలక్ష్మి, ఉపసర్పంచు రంగస్వామి, నాయకులు దామోదర్‌రెడ్డి, కృష్ణ, దడవాయి నరసింహ, కృష్ణ, బాలముని, వెంకటన్న, చిన్న రంగన్న, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!