వానలు రాకముందే పనులు పూర్తవ్వాలి

ABN , First Publish Date - 2022-05-15T04:16:40+05:30 IST

మినీట్యాంక్‌ బండ్‌లో చేపడు తున్న అబివృద్ది పనులను శనివారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు, ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు పరిశీలించారు.

వానలు రాకముందే పనులు పూర్తవ్వాలి
ట్యాంక్‌బండ్‌ పనులపై చర్చిస్తున్న కలెక్టర్‌ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు

 - ట్యాంక్‌బండ్‌ పనులు పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ

మహబూబ్‌నగర్‌, మే 14 : మినీట్యాంక్‌ బండ్‌లో చేపడు తున్న అబివృద్ది పనులను శనివారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు, ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు పరిశీలించారు. చెరు ులో పూడికతీత, బండ్‌ వెడల్పు, సస్పెన్షన్‌ బ్రిడ్జి, నెక్లెస్‌ రోడ్‌ పనులు సాగుతున్నాయి. పనులను పరిశీలించిన కలెక్టర్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాలు కురవక ముందే దాదాపుగా పనులు పూర్తయ్యేలా మరింత వేగంగా పనులు చేపట్టాలని సూచించారు. అవసరమైతే మరిన్ని యంత్రాలను పెంచుకోవాలని సూచించారు. పెద్దచెరువు పనులు పూర్తయితే ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతం కానుంద ని, పనులను పూర్తి పారదర్శకంగా చేపట్టాలని ఆదేశించారు. 

Read more