కల్యాణం... కమనీయం

ABN , First Publish Date - 2022-05-15T04:06:09+05:30 IST

మండల కేంద్రంలోని రామాలయంలో శనివారం లక్ష్మీనర్సిం హస్వాముల కల్యాణం కమనీయంగా నిర్వహించినట్లు రామాలయాల చైర్మన్‌ జబ్బు పెద్దిరాజుయాదవ్‌ తెలిపారు.

కల్యాణం... కమనీయం
లక్ష్మీనర్సింహస్వామి యజ్ఞంలో పాల్గొన్న చైర్మన్‌ పెద్దిరాజుయాదవ్‌ దంపతులు

పదర, మే 14: మండల కేంద్రంలోని రామాలయంలో శనివారం లక్ష్మీనర్సిం హస్వాముల కల్యాణం కమనీయంగా నిర్వహించినట్లు రామాలయాల చైర్మన్‌ జబ్బు పెద్దిరాజుయాదవ్‌ తెలిపారు. ఆయన శనివారం విలేకర్లతో మాట్లాడుతూ గ్రామంలో రైతుల పాడి పంటలు మంచిగా ఉండాలని, గ్రామంలో ఉద్యోగాల కో సం శిక్షణ తీసుకుంటున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలని, స్వామి సన్నిధిలో యజ్ఞం, కల్యాణం, అనంతరం రాత్రి సమయంలో భక్తిసంకీర్తనలు వంటి ప్రత్యేక పూజలను ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో చేశామని పేర్కొన్నారు. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలను నిర్వహించేందుకు భక్తులు ముందుకు రావాలని కోరారు.  పర్వతాలు, నిరంజన్‌, శ్రీను, అనిల్‌, రమేష్‌, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. 



Read more