పరిశ్రమల పేరుతో రైతుల భూములు లాక్కుంటే అడ్డుకుంటాం

ABN , First Publish Date - 2022-05-15T04:20:22+05:30 IST

రైతులకు ఇచ్చిన అసైన్డ్‌ భూములను లాక్కొని అక్కడ పరి శ్రమ నెలకొల్పాలని ప్రయత్నిస్తే కాంగ్రెస్‌ పార్టీ అడ్డుకుని తీరుతుందని డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లాకొత్వాల్‌ స్పష్టం చేశారు.

పరిశ్రమల పేరుతో రైతుల భూములు లాక్కుంటే అడ్డుకుంటాం

- డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌

- హన్వాడ ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్‌పై కలెక్టర్‌కు వినతి

మహబూబ్‌నగర్‌, మే 14 : రైతులకు ఇచ్చిన అసైన్డ్‌ భూములను లాక్కొని అక్కడ పరి శ్రమ నెలకొల్పాలని ప్రయత్నిస్తే కాంగ్రెస్‌ పార్టీ అడ్డుకుని తీరుతుందని డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లాకొత్వాల్‌ స్పష్టం చేశారు. హన్వాడ మండలంలో ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్‌ కోసం దళిత, గిరిజనులకు చెందిన అసైన్డ్‌ భూములను ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. హన్వాడ రైతులతో కలిసి శనివారం ఆయన కలెక్టర్‌ వెంకట్రావును కలిసి విన తిపత్రం సమర్పించారు. రైతుల ఇష్టానికి విరుద్ధంగా వారి భూముల్లో పరిశ్రమ ఏర్పాటు చేయవద్దని కలెక్టర్‌కు సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలకు భూములను ఇచ్చిందని, ఇప్పటి ప్రభుత్వం ఆ భూములను లాక్కుంటోందని పేర్కొన్నారు. పరిశ్రమలు పెట్టి పెద్దోళ్లకు మేలు చేసే ప్రయత్నం చేయవద్ద న్నారు. ఒకవేళ పరిశ్రమలు ఏర్పాటుచేయాలంటే రైతుల దగ్గరినుంచి భూములు కొనుగోలు చేసి ఏర్పాటు చేసుకోవాలని, అంతేతప్ప ఎకరా, అరెకరా ఉన్న రైతుల నుంచి భూమి తీసు కోవడం సరికాదని సూచించారు. కలెక్టర్‌, తహసీల్దార్‌ పునరాలోచించాలని చెప్పారు.

Read more