ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

పేదల భూములు పేదలకే దక్కాలి

ABN, First Publish Date - 2022-05-15T04:30:29+05:30

పేదల భూములు పేదలకే దక్కాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు.

కంసాన్‌పల్లి గ్రామంలో రైతులతో మాట్లాడుతున్న సీపీఎం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

- మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి  

దామరగిద్ద, మే 14 : పేదల భూములు పేదలకే దక్కాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని కంసాన్‌పల్లి గ్రామాన్ని సందర్శించి 229 సర్వేనెంబర్‌లో తరతరాలుగా సాగుచేసుకుంటున్న రైతుల భూములను పరిశీలించారు. అనంతరం రైతులతో సమావేశమై మాట్లాడారు. పేదల భూములను తీసుకోవాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. బేష రత్తుగా సాగులో ఉన్న 650 ఎకరాలకు భూమికి యాజమాన్య హక్కు కల్పించాలన్నారు. కంపెనీలకు పేదల భూములు ఇవ్వడం గొప్ప కాదని, దమ్ముంటే పేదలకు భూములు ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి ఆధ్వర్యంలో 200 ఎకరాలకు మాత్రమే రైతులకు యాజయాన్య హక్కులు కల్పిస్తామని మంత్రి కేటీఆర్‌ ప్రకటన చేయించడం అన్యాయం అన్నారు. ప్రజలను ప్రలోభ పెట్టి సాగుచేస్తున్న భూమిని లాక్కుంటే పాలకులను తరమికొట్టక తప్పదని హెచ్చ రించారు. 650 ఎకరాల్లో ఒక్క సెంటు కూడా రైతులు వదలడానికి సిద్ధంగా లేరని ప్రభుత్వం గమనిం చాలన్నారు. ప్రతీ రైతుకు పట్టా పుస్తకాలు ఇచ్చి రైతుబీమా, రైతుబంధు అందజేయాలని డిమాండ్‌ చేశారు. నాయకులు వెంకట్రాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రాంరెడ్డి, గోపాల్‌, అంజిలయ్యగౌడ్‌, బాల్‌రామ్‌, శివకుమార్‌, రైతులు ఉన్నారు.

రైతులకు అండగా కాంగ్రెస్‌ : పీసీసీ అధికార ప్రతినిధి  హర్షవర్ధన్‌రెడ్డి

కంసాన్‌పల్లి గ్రామం సర్వేనెంబర్‌ 229లో తరతరాలుగా సాగులో ఉన్న రైతులు దిగులు పడాల్సిన అవసరం లేదని వారికి కాంగ్రెస్‌ అండగా ఉంటుందని పీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం కంసాన్‌పల్లి గ్రామా న్ని సందర్శించి రైతులతో సమావేశమై మాట్లాడారు. ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి పట్టా పాస్తుకాలు ఇస్తామని పలుమార్లు భరోసా కల్పించారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సమస్యను పరిష్కరించేది పోయి సాగులో ఉన్న పేదల భూములను తీసు కుంటామని చెప్పడం ఎంతవరకు సమంజసం అన్నారు. కంసాన్‌పల్లి గ్రామ సమస్యను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!