కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి

ABN , First Publish Date - 2022-05-15T04:14:32+05:30 IST

రైతులు పండించిన ఽధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని డీసీసీబీ డైరెక్టర్‌ సింగిల్‌విండో చైర్మన్‌ మామిళ్లపల్లి విష్ణువర్ధ్దన్‌రెడ్డి అన్నారు.

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి

- డీసీసీబీ డైరెక్టర్‌ మామిళ్లపల్లి విష్ణువర్ధ్దన్‌రెడ్డి

పాన్‌గల్‌, మే 14 : రైతులు పండించిన ఽధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని డీసీసీబీ డైరెక్టర్‌ సింగిల్‌విండో చైర్మన్‌ మామిళ్లపల్లి విష్ణువర్ధ్దన్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని జమ్మాపూర్‌, తెల్లరాళ్లపల్లి, శాఖాపూర్‌ గ్రామాల్లో సింగిల్‌విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు దళారుల వద్ద విక్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచులు చెన్నమ్మ, రేణమ్మ, మౌనిక, ఉప సర్పంచు నాగరాజు, ఎంపీటీసీ సుబ్బయ్యయాదవ్‌, సీఈవో భాస్కర్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు తిరుపతియాదవ్‌, నిరంజన్‌ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Read more