-
-
Home » Telangana » Mahbubnagar » The disappearance of the young man-MRGS-Telangana
-
యువకుడి అదృశ్యం
ABN , First Publish Date - 2022-05-15T04:49:34+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలోని మహ బూబ్‌నగర్ జిల్లాలోని చింతకుంట మండలం ముచ్చింతల గ్రామానికి చెందిన చంద్రప్ప(24) అనే యువకుడు అదృశ్యమయ్యాడు.
జూపాడుబంగ్లా, మే 14: తెలంగాణ రాష్ట్రంలోని మహ బూబ్‌నగర్ జిల్లాలోని చింతకుంట మండలం ముచ్చింతల గ్రామానికి చెందిన చంద్రప్ప(24) అనే యువకుడు అదృశ్యమయ్యాడు. చంద్రప్ప కుటుంబ సభ్యులతో కలిసి ఫిబ్రవరి నెలలో జూపాడుబంగ్లా మండలంలోని లింగాపురం గ్రామానికి వచ్చారు. గ్రామ పొలిమేరలోని జగన్‌మోహన్‌రెడ్డి అనే రైతు పొలంలోని చీని పండ్లతోటలో పనిలో చేరారు. అయితే ఈనెల 11వ తేది నుంచి కనిపించడం లేదు. చంద్రప్ప భార్య చంద్రకళ శనివా రం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య తెలిపారు.

