ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి

ABN, First Publish Date - 2022-05-15T04:50:23+05:30

వైద్యులు సకాలంలో పట్టించుకోకపోవడంతో ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం చోటు చేసుకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750


గద్వాల క్రైం, మే 14: వైద్యులు సకాలంలో పట్టించుకోకపోవడంతో ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం చోటు చేసుకొంది. వివరాలిలా ఉన్నాయి. మల్దకల్‌ మండలం మద్యలబండ తండాకు చెందిన వెంకటమ్మ శనివారం తన మొదటికాన్పు కోసం జిల్లా ఆసుపత్రికి వచ్చింది. అయితే నొప్పులు వస్తున్నాయని చెబుతున్నా కూడా వైద్యులు పట్టించుకోకపోవడం, చివరి క్షణాల్లో కాన్పు చేయడంతో కడుపులోనే శిశువు చనిపోయింది. దీంతో బంధువులు ఆసుపత్రి సిబ్బందిపై దాడికి దిగారు. శిశువు మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ మండిపడ్డారు. ఘటనా స్థలానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వచ్చి బాధితులను పరామర్శించారు. 

 శిశువు బంధువులకు ముందే చెప్పాం

  - డాక్టర్‌ కిశోర్‌కుమార్‌, సూపరింటెండెంట్‌, గద్వాల

సిజేరియన్‌ ఆపరేషన్‌ చేస్తే తల్లి, బిడ్డ క్షేమంగా ఉంటారని బాధితులకు ముందుగానే చెప్పాం. అయితే వారు సాధారణ కాన్పు చేయాలని ఒత్తిడి చేశారు. అయినా కూడా ప్రయత్నించాం. కానీ చివరి క్షణంలో ఉమ్మనీరు ఎక్కువగా పోవడంతో పాటు తల్లిప్రేగుతో శిశువు ఉండటంతో శిశువు మృతి చెందింది. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం ఏమీ లేదు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!