ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

టీఆర్‌ఎస్‌ అవినీతిపై చర్చకు సిద్ధం

ABN, First Publish Date - 2022-05-15T04:25:48+05:30

టీఆర్‌ఎస్‌ పాలనలో అవినీతి పెరిగిపోయిందని, రా ష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

పూర్తి ఆధారాలతో నిరూపిస్తా

నయీం గ్యాంగ్‌లా  దోచుకుంటున్న నాయకులు 

కాంగ్రెస్‌ వరంగల్‌ డిక్లరేషన్‌తో రైతులకు ప్రయోజనం

పార్టీ సీనియర్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డి


మహబూబ్‌నగర్‌, మే 14: టీఆర్‌ఎస్‌ పాలనలో అవినీతి పెరిగిపోయిందని, రా ష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని ప్యాకేజీ4,6లో వేల కోట్ల అవినీతి జరిగిందని, ఈ విషయంలో తన తో చర్చకు ఎవరొచ్చినా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా  కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై స్టే తీసుకువచ్చానని ఓ మంత్రి మాట్లాడుతున్నారని, ఆయనకు బుద్దుందా అని ప్రశ్నించారు. మోటార్లు, పంప్‌ల కొనుగోళ్లలో జరుగుతున్న రూ.5554వేల కోట్ల అవినీతిపై తాను సుప్రీం కోర్టును ఆశ్రయించానే తప్పా ప్రాజెక్ట్‌ ఆపాలని కాదన్నారు. కుర్చీ వేసుకుని కూ ర్చుంటానని, 30 నెలల్లో పనులు పూర్తి చేయిస్తానని చెప్పిన కేసీఆర్‌ 72నెలలు అ యినా 40శాతం పనులు చేపట్టకపోవడం సిగ్గుచేటన్నారు. పాలమూరు-రంగారెడ్డిని జూరాల నుంచి కాకుండా శ్రీశైలం నుంచి తీసుకోవడం వల్ల నష్టం వాటిల్లిందన్నారు. జూరాల నుంచి వరద సమయంలో రోజూ మూడు టీఎంసీలను తీసుకుంటే పాల మూరుతో పాటు, 69జీవో ద్వారా నారాయణపేట, మక్తల్‌, కొడంగల్‌ సస్యశ్యామ లం అయ్యేదన్నారు.  టీఆర్‌ఎస్‌ నేతలు నయీం గ్యాంగ్‌లా ఎక్కడపడితే అక్కడ దోచుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసైన్డ్‌ భూములు కాంగ్రెస్‌ ఇస్తే ఈ ప్రభుత్వం వాటిని రైతుల నుంచి లాక్కుంటోందని విమర్శించారు. చెరువుల్లో నల్లమ ట్టిని అమ్ముకుంటున్నారని ఆరోపించారు. రైతులను పూర్తిగా విస్మరించారన్నారు. రైతులకు రైతుబంధు ఇస్తూ క్రాప్‌ ఇన్సూరెన్స్‌ బంద్‌ చేశారన్నారు. రుణమాఫీ లేదు.. కల్వకుర్తి కింద వేల ఎకరాలు ఎండిపోతే పట్టించుకునే దిక్కు లేదన్నారు. వరి కొను గోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదని, ఇప్పటికే 80శాతం ధాన్యాన్ని రైతులు తక్కువ ధరకు విక్రయించారని చెప్పారు. రైతులకు రుణాలు ఇవ్వకుండా, క్రాప్‌ ఇన్సూరెన్స్‌లు ఇవ్వకుండా రైతుభీమా ఇస్తున్నామని చెప్పడం సిగ్గుచేటన్నారు. రైతులను ఆదుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ వరంగల్‌ సభలో రైతు డిక్లరేషన్‌ ప్రకటించిందన్నారు. కేసీఆర్‌ వచ్చాక రూ.5 లక్షల కోట్లు అప్పుచేసి ఎవరికి పెట్టారో  చెప్పాలన్నారు. ఆర్థిక పరిస్థితి చూస్తుంటే తెలంగాణను శ్రీలంక మాదిరి చేసేలా ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌, నాయకులు జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి, వినోద్‌కుమార్‌, సత్తూరు చంద్రశేఖర్‌గౌడ్‌, సంజీవ్‌ముదిరాజ్‌, లక్ష్మణ్‌ యాదవ్‌, సిరాజ్‌ఖాద్రి, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు బెక్కరి అనిత పాల్గొన్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!