పది ఫలితాలకు కొత్త ప్రణాళికలు

ABN , First Publish Date - 2022-05-15T04:47:10+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడంలేదు.

పది ఫలితాలకు కొత్త ప్రణాళికలు
బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్న జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు (ఫైల్‌)

- ప్రత్యేక వ్యూహంతో ముందడుగు

- విద్యార్థులకు ప్రారంభమైన ప్రత్యేక పునశ్ఛరణ తరగతులు 

- జిల్లాను మొదటి స్థానంలోనిలిపేందుకు కృషి

- నూరు శాతం ఫలితాలే లక్ష్యం

- గత రెండు సంవత్సరాలువిద్యార్థులు పరీక్షలకు దూరం

- ప్రత్యేక ప్రణాళికలతో బోధన


అచ్చంపేట టౌన్‌, మే 14: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడంలేదు. ఈ ఏడాది ఉత్తీర్ణత నూరు శాతం సాధించడమే లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. దీని కోసం కొత్త ప్రణాళకను రూపకల్పన చేసింది. ఈ ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో  మొత్తం 128 ఉన్నత పాఠశాలలు, 20 కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 11 వేల మంది విద్యార్థులు పదో తరగతి విద్యనభ్యసిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమయాన్ని విద్యార్థులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా ప్రధానోపాధ్యాయులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల సమయానికి అదనంగా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. పాఠశాల ప్రారంభానికి ముందు ఉదయం 8.30 నుంచి 9.30 గంటల సమయం వరకు, సాయంత్రం 4.45 నుంచి 5.45 గంటల వరకు ప్రత్యేక తరగతులు కొనసాగను న్నాయి. రోజువారీగా ప్రత్యేక తరగతుల్లో బోధించే సబ్జెక్టులు పాఠం పేరుతో సహ ప్రణాళికలో పొందుపరిచారు.

 ఎక్కువ టెస్టులు నిర్వహిస్తాం

పదవ తరగతి విద్యార్థులకు వీలైనంత ఎక్కువ టాలెంట్‌ టెస్టులు నిర్వహిస్తే విద్యార్థులకు పరీక్షలో భయం పోగొట్టగలుగుతాం. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు నిత్యం అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు వారి పాఠశాలలో వచ్చే సందేహాలు తీరిస్తే విద్యార్థులు మరింత మెరుగుపడుతారు.

 వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి

నెలలో పదో తరగతి సిలబస్‌ పూర్తి  పరిశీలనకు ఒక్కో మండలానికి పక్క మండలాల ప్రధానోపాధ్యా యులను పరిశీలకులుగా నియమించారు. సిలబస్‌తో పాటు ఎప్పటికప్పుడు సబ్జెక్టుల వారీగా పునశ్ఛరణ చేసి పరీక్షలకు సన్నద్థం చేసేల ప్రత్యేక తరగతులు నిర్వహిం చనున్నారు. ముఖ్యంగా వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించేలా అధికారులు సూచనలు చేశారు. విద్యా ర్థుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు ప్రత్యేక తరగతుల్లో విద్యార్థులు నేర్చుకున్న అంశాలపై వారాంత పు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆదివారం కూడా ఒక పూట పదో తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహించే లా అధికారులు ఆదేశాల మేరకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కలిసి ప్రణాళిక రూపొందించారు.

 ప్రణాళికను పకడ్భందీగా అమలు చేస్తాం

వందశాతం ఫలితాలు సాధించాలనే ఆశయంతో జిల్లా విద్యాశాఖ రూపొందించిన ప్రణాళికను పకడ్భందీడా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పరీక్షల్లో వచ్చే ముఖ్య ప్రశ్నలను విద్యార్థులకు చెప్పి సన్నద్ధత చూపాలని సూచించాం. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్ట్‌ ఉపాధ్యా యులతో సమావేశం ఏర్పాటు చేసి అమలుకు సన్నద్ధం చేస్తాం. 


 ప్రతీ విద్యార్థి పాసయ్యే విధంగా ప్రత్యేక తరగతులు నిర్వహించాలి

- గోవిందరాజులు జిల్లా విద్యాశాఖ అధికారి

పదవ తరగతి పరీక్షల్లో ప్రతీ విద్యార్థి ప్రతిభను కనబర్చేలా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో ఉంటూ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వందశాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలి. కరోనా పరిస్థితుల వల్ల గత రెండు సంవత్సరాలుగా విద్యార్థులు విద్యకు దూరమైనప్పటికీ జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. పతవ తరగతి పరీక్షలకు ఇంకా 20రోజుల  సమయం ఉండటంతో ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి బోధించాలి.

Read more