ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

మిషన్‌ భగీరథ నీరు ఇంటింటికీ అందాలి

ABN, First Publish Date - 2022-05-15T04:11:39+05:30

ఇంటింటికి మిషన్‌ భగీరథ తాగునీరు అందించేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు.

మాట్లాడుతున్న మంత్రి నిరంజన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

వనపర్తి అర్బన్‌, మే 14: ఇంటింటికి మిషన్‌ భగీరథ తాగునీరు అందించేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. శనివారం వివిధ అంశాల పై కలెక్టరేట్‌లో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూరల్‌, ప్రకృతి ప్రాంతాలలో ఇంటింటికి మిషన్‌ భగీరథ నీరు అందేలా కృషి చేయాలని అన్నారు. స్వచ్ఛమైన తాగునీరు అందరికీ అందుతుందా అని అడిగి తెలుసుకోవాలన్నారు. పైపులైన్‌ విస్తరణ, నల్లా కనెక్షన్లు పూర్తి చేయాలని, చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని మంత్రి ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిష న్‌ భగీరథ పథకం ద్వారా ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుం టున్నదని మంత్రి తెలిపారు. పట్టణంలో 1.14 కిలో మీటర్ల పైప్‌లైన్‌ పెండింగ్‌లో ఉన్నదని  మునిసిపల్‌ ఇంజనీర్‌ తెలిపారు. అప్పాయిపల్లి దగ్గర 650 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను పరిశీలించి రిపోర్టు జిల్లా కలెక్టర్‌కు ఇవ్వాలని మేఘారెడ్డికి సూచించారు. రాజ నగరంలో ట్యాంకులు పరిశీలించాలని, చందాపూర్‌, దత్తాయిపల్లి గ్రామాలలో ట్రాన్స్‌ఫార్మర్లు హైవోల్టేజ్‌ తో కాలిపోతున్నాయని, వాటిని పరిశీలించాలని ఆ యన ఆదేశించారు. పెబ్బేరులో జనాభాకు తగినట్లు నీటి సరఫరా జరగాలని, గొల్లపల్లిలో నిర్మించిన రిజర్వాయర్‌ పనులు వారం రోజుల్లో పూర్తి చేయా లన్నారు. అలాగే మూడు వందల కోట్లతో చేపట్టిన మిగతా రిజర్వాయర్‌ పనులు జూలై 30 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్‌, రహదారులు, భవ నాలు, పంచాయతీ రాజ్‌ శాఖపై సమీక్ష  నిర్వహిం చారు.  కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా మాట్లాడుతూ జిల్లాలోని మిషన్‌ భగీరథ పనులు సత్వరం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రికి తెలి పారు. ప్రతీ ఇంటికి నల్లా నీరు అందించేలా గ్రామా లలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు పర్యవేక్షించి స్వచ్ఛమైన తాగునీరు అందించేలా కృషి చేస్తారని ఆమె తెలిపారు.  కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి,  అదనపు కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వా న్‌, జిల్లా రైతుబంధు అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, వనపర్తి మునిసిపాలిటీ చైర్మన్‌ గట్టు యాదవ్‌, మార్కెట్‌ చైర్మన్‌ లక్ష్మారెడ్డి, గొర్రెల సంఘం చైర్మన్‌ కురుమూర్తి యాదవ్‌, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, జిల్లా అధికారులు, ఎస్‌ఈ క్యాడర్‌ అధికారులు, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.  


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!